AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: పెళ్లి పీటల మీదే వధువుని లేపుకెళ్లిన లవర్‌.. నెట్టింట హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోలో నిజమెంతంటే?

పెళ్లిళ్ల సీజన్‌ కాకపోయినా సోషల్‌ మీడియాలో వేలాది వెడ్డింగ్‌ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి పెళ్లి వీడియో ఒకటి నెటిజన్లకు బాగా నవ్వు తెప్పిస్తోంది

Fact Check: పెళ్లి పీటల మీదే వధువుని లేపుకెళ్లిన లవర్‌..  నెట్టింట హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోలో నిజమెంతంటే?
Bride Video
Basha Shek
|

Updated on: Oct 15, 2022 | 5:39 PM

Share

పెళ్లిళ్ల సీజన్‌ కాకపోయినా సోషల్‌ మీడియాలో వేలాది వెడ్డింగ్‌ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి పెళ్లి వీడియో ఒకటి నెటిజన్లకు బాగా నవ్వు తెప్పిస్తోంది. సాధారణంగా వధూవరుల ఇష్టంతోనే పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే నేటికీ కొన్ని చోట్ల వధువు ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పెళ్లి కూతురు బలవన్మరణానికి పాల్పడడమో లేదా మనసుకు నచ్చిన వారితో వెళ్లిపోవడమో జరుగుతుంటుంది. ఇది కూడా అలాంటిదే. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ ప్రేమికుడు వివాహ వేదిక పైకి వచ్చి మరీ వధువును తీసుకెళ్లాడు. అది కూడా ప్రియురాలి నుదుటున ఐదుసార్లు సింధూరం దిద్ది మరీ తీసుకెళ్లాడు.

సింధూరం దిద్ది..

వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంటుంది. వధూవరులిద్దరూ వేదికపై కూర్చొని ఉంటారు. సరిగ్గా గమనిస్తే వరుడి కాస్తా ఏజ్డ్‌ పర్సన్‌ అనిపిస్తుంది. వధువుకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేనట్లుంది. అందుకే వేదికపై తల వంచుకుని కూర్చుంటుంది. వరుడు మాత్రం కులాసాగా ఉంటూ అతిథులతో మాట్లాడుతుంటాడు. ఇంతలో పెళ్లి వేదిక వెనకవైపు నుంచి చాటుగా వస్తాడు ప్రియుడు. పెళ్లి కూతురు కుర్చీ వెనక నిలబడి.. ఆమె నుదుట ఐదుసార్లు సింధూరం దిద్దుతాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యక్తి వధువు చేయి పట్టుకుని వేదికపై నుంచి తీసుకుపోతారు. దీంతో వరుడితో సహా అక్కడున్న వారు ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

shitty.humours పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పాతదే అయినా చాలా ఫన్నీగా ఉంది. అందుకే నెటిజన్లు ఒకరికొకరు షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఇది ఫేక్‌ వీడియో, ఎడిట్‌ చేశారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి..

అసలు విషయమేమింటే?

అయితే ఇది ఎడిటెడ్‌ వీడియో అని ఫ్యాక్ట్‌ చెక్‌ ధ్రువీకరించింది. అంతేకాదు గతంలో ఇదే ఈవెంట్‌కు జరిగిన ఒరిజినల్‌ వీడియోను షేర్‌ చేసింది. అందులో వెడ్డింగ్‌ఈవెంట్‌ వాళ్లు పెళ్లి కూతురును ముస్తాబు చేయడంలో భాగంగా వధువు నుదుట సింధూరం దిద్దుతారు. అదే వీడియోను కొందరు ఎడిట్‌ చేసి వధువును లేపుకెళ్లినట్లుగా మార్చారని ఫ్యాక్ట్‌ చెక్‌ నిర్ధారించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..