CCTV: కాలేజీ విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లి మరీ..
ఈ ఘటన ఉదయం 6.45 గంటలకు జరిగినట్లు సమాచారం. పరారీలో ఉన్న ఆటో రిక్షా డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని థానే నగరంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 21 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై ఆటో రిక్షా డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం యువతిని రోడ్డుపై దాదాపు 500 మీటర్ల మేర వాహనంతో ఈడ్చుకెళ్లి పరారయ్యాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనాస్థలికి సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఆటో రిక్షా డ్రైవర్ ప్రవర్తన రికార్డయింది. ఈ ఘటన ఉదయం 6.45 గంటలకు జరిగినట్లు సమాచారం. పరారీలో ఉన్న ఆటో రిక్షా డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
విద్యార్థి కళాశాలకు వెళుతుండగా రోడ్డుపై నిలబడి ఉన్న ఆటో రిక్షా డ్రైవర్ ఆమెపై అసభ్యంగా వ్యాఖ్యానించాడని ఇన్‌స్పెక్టర్ జయరాజ్ రణవారే తెలిపారు. ఆటో రిక్షా డ్రైవర్ విద్యార్థిని చేయి పట్టుకుని లోపలికి ఈడ్చుకెళ్లాడని, దీంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా విద్యార్థి కాలర్ పట్టుకున్నాడు. ఆ సమయంలో నిందితులు ఆటో రిక్షా స్టార్ట్ చేసి పరుగులు తీశాడు. నిందితుడు విద్యార్థి ఆటో రిక్షా డ్రైవర్‌ను ఆపేందుకు ప్రయత్నించడం, ఆటో డ్రైవర్ వేగంగా పారిపోవడం ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో విద్యార్థిని దాదాపు 500 మీటర్ల మేర రోడ్డుపైనే ఈడ్చుకెళ్లి వదిలేయంటంతో ఆమె అక్కడే కుప్పకూలింది. అయినా అతడు ఆటోను ఆపలేదు.
#Maharashtra#Thane@ThaneCityPolice@MumbaiPolice ठाणे स्टेशन के पास रिक्शावाले ने लड़की को छेड़ा, विरोध करने पर उसे चलती रिक्शा में घसीटते हुए ले गया pic.twitter.com/EO3NKn01fX
— Sweta Gupta (@swetaguptag) October 14, 2022
విద్యార్థి చేయి పట్టు సడలిన వెంటనే రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆటో డ్రైవర్ వేగంగా పరారయ్యాడు. అటుగా వెళ్తున్న వాహహనాలు కూడా ఆగలేదు.. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు గాయపడిన విద్యార్థిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి