కొత్త బైక్ కొన్న ఆనందంలో ఓ భర్త చేసిన పనితో అంతా అవాక్కు..! ఇంతకీ ఏం చేశాడంటే..

భర్త మోటార్ సైకిల్ కొన్నాడు. అతను తన భార్యతో కలిసి షోరూమ్ కు వెళ్లాడు. ఇలా ఉండగానే సిబ్బంది అతని భార్యను మోటార్‌సైకిల్‌ పక్కగా నిలబడి పోజులివ్వమని అడిగాడు.

కొత్త బైక్ కొన్న ఆనందంలో ఓ భర్త చేసిన పనితో అంతా అవాక్కు..! ఇంతకీ ఏం చేశాడంటే..
Buying A New Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 15, 2022 | 2:54 PM

మిమ్మల్ని నవ్వించే కంటెంట్‌కు ఇంటర్నెట్‌లో ఎలాంటి కొరతా ఉండదు. సోషల్ మీడియా నిండా అనేకం వైరల్‌ వీడియోలు, ఫోటోలు నెటిజన్లను నవ్విస్తాయి. ఆశ్చర్యపరుస్తాయి. షాక్‌ అయ్యేలా చేస్తాయి. దానిని నిరూపించేలా ఇక్కడ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్‌లో, ఒక వ్యక్తి తన కొత్త మోటార్‌సైకిల్‌కు పూలమాల వేయడానికి బదులుగా తన భార్య మెడలో దండ వేసాడు. ఈ అందమైన వీడియోను చికూ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. సోషల్ మీడియా యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో కొత్త మోటర్‌బైక్ కొనుగోలు చేసిన తర్వాత ఒక కుటుంబం షోరూమ్‌ వద్ద కనిపించింది. వాహనానికి అప్పటికే రిబ్బన్ కట్టి ఉంచారు. సేల్స్ మాన్ దాని కోసం ఒక దండను కూడా సిద్ధం చేస్తున్నాడు. బైక్‌ కొనుగోలు చేసిన యజమాని, అతని భార్య ఆ దండ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఉండగానే సిబ్బంది అతని భార్యను మోటార్‌సైకిల్‌ పక్కగా నిలబడి పోజులివ్వమని అడిగాడు. సేల్స్ మాన్ పూల దండను ఆ వ్యక్తికి అందించిన వెంటనే అతడు దానిని తన భార్య మెడలో వేయడానికి ముందుకొచ్చాడు. నిజంగా ఇది ఓ మధుర క్షణంగానే చెప్పాలి. దాంతో ఆ మహిళ..సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంటోంది. వెంటనే ఆమె చెబుతుంది…ఆ దండ నాకు కాదు వేయాల్సింది…బైక్ కు అని చెప్పడంతో..అతను బైక్ పూలమాల వేస్తాడు. భార్యపై అతనికున్న ప్రేమకు అక్కడున్నవారంతా నవ్వుతారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు ప్రతి భార్య తన భర్త నుంచి పొందే ప్రేమ ఇదే అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను జిందగీ గుల్జార్ హై పేరుతో ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు 3500వ్యూస్ రాగా..900మంది లైక్ చేశారు. 200మంది రీట్వీట్ చేశారు. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఎంతఅందమైన వీడియో అని కొందరు కామెంట్ చేస్తే…భార్య అంటే గౌరవం అని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి