ప్రొఫెసర్ జీ.సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్.. హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం
శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌పై ఉన్న 52 ఏళ్ల సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. 2017లో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను..
ప్రొఫెసర్ జీ.సాయిబాబాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దేశద్రోహం కేసులో సాయిబాబాతో పాటు ఆరుగురిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. సాయిబాబాపై ఆరోపణలను సరిగ్గా పరిశీలించకుండానే హైకోర్టు తీర్పును ఇచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో నాగ్‌పూర్ జైల్లోనే సాయిబాబా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తన వైకల్యం, ఆరోగ్య పరిస్థితుల కారణంగా తనను గృహనిర్బంధంలో ఉంచాలని మాజీ DU ప్రొఫెసర్ చేసిన విజ్ఞప్తిని కూడా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన సుప్రీం.. ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. 2017లో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ కూడా అనుమతించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. వీల్‌చైర్‌లో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 2014 మే నెలలో సాయిబాబాతోపాటు కొందరు జేఎన్‌యూ స్టూడెంట్స్‌ని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. సాయిబాబా అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2017 మార్చ్‌లో వీళ్లందరికీ జీవితఖైదు విధించింది గడ్చిరోలి సెషన్స్ కోర్టు. అరెస్టైననాటి నుంచి ఇప్పటివరకు సుమారు 8ఏళ్లుగా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు సాయిబాబా.
అతను ఏ తప్పు చేయనందున అతను నిర్దోషిగా విడుదల అవుతాడని మాకు నమ్మకం ఉందన్నారు సాయిబాబా కూతురు వసంత కుమారి.. న్యాయవ్యవస్థకు, తమకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సాయిబాబా దంపతుల కూతురు వసంత కుమారి ప్రస్తుతం విదేశాల్లో చదువుతోంది. గత ఎనిమిదేళ్లుగా తన తండ్రి కోసం చాలా పోరాడుతున్నామని, ఇంకా సహనంతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. తన తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో కష్టంగా మారిందన్నారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌పై ఉన్న 52 ఏళ్ల సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి