AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లోకి చొరబడ్డ పాము.. వెంటనే రంగంలోకి అధికారులు.. ఫైనల్‌గా

ఆసియాటిక్ వాటర్ స్నేక్ అని కూడా పిలువబడే ఐదు అడుగుల పొడవైన చెకర్డ్ కీల్‌బ్యాక్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో కనిపించింది. భద్రతా అధికారులను గందరగోళానికి గురి చేసింది.

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లోకి చొరబడ్డ పాము.. వెంటనే రంగంలోకి అధికారులు.. ఫైనల్‌గా
Amit Shah
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2022 | 10:53 AM

Share

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలోకి పాము ప్రవేశించింది. అమిత్‌షా ఇంట్లో పాము ప్రత్యక్షం కావటంతో ఒకింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పామును సిబ్బంది తొలుత భయంతో అటు ఇటూ పరుగులు తీశారు. హోం గార్డు గది సమీపంలో పాము కనిపించి హల్‌చల్‌ చేసింది. జనాల గందరగోళంతో పాము అక్కడే ఉన్న చెక్క పలకల మధ్య దాక్కుని ఉంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అటవీ అధికారులు, స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. గంటల తరబడి శ్రమించి పామును ఎట్టకేలకు బయటకు తీశారు. పాము ఐదు అడుగుల పొడవు ఉంది.

ఆసియాటిక్ వాటర్ స్నేక్ అని కూడా పిలువబడే ఐదు అడుగుల పొడవైన చెకర్డ్ కీల్‌బ్యాక్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో కనిపించింది. ఇది భద్రతా అధికారులను గందరగోళానికి గురి చేసింది. అధికారులు వైల్డ్‌లైఫ్ SOSను అప్రమత్తం చేయడంతో చివరికి సురక్షితంగా బంధించి సమీప అడవుల్లో విడిచిపెట్టారు. ఇది విషంలేని పాముగా గుర్తించారు. చెకర్డ్ కీల్‌బ్యాక్ ప్రధానంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువలు, వ్యవసాయ భూములు, బావుల వంటి నీటి వనరులలో ఎక్కువగా కనిపిస్తుంది. 1972 వన్యప్రాణి (రక్షణ) చట్టం షెడ్యూల్ II ప్రకారం ఈ జాతి పాములను రక్షిస్తుంది. ఇకపోతే, ఢిల్లీలో వర్షాకాలంలో ఇలా ఇళ్లలోకి దూరిన దాదాపు 70 పాములు పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. వర్షాలు, వరదల కారణంగానే పాములు తరచూ ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు.

అయితే పాములు ఇళ్లలోకి చొరబడేందుకు ముఖ్యంగా ఆరు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. పాములు సీజన్ ప్రకారం పాత చర్మాన్ని వదిలేస్తుంటాయి. పాములు పాత చర్మాన్ని విడిచేటప్పుడు సపోర్ట్ కోసం రాళ్లు, కాంక్రీటు, కలప వంటి ఆసరాను వెతుక్కుంటూ ఇళ్లవైపుకు వస్తాయి. ఇంకా పాములకు ఆహారం లభించకపోవడంతో ఆహారం కోసం కూడా ఇళ్లవైపుకు వస్తుంటాయి. ఇళ్లలో ఉండే ఎలుకలు, బయట ఉండే కప్పలు, బల్లులు, పక్షుల కోసం వస్తుంటాయి. పాములు, ఇతర కీటకాలు నేల క్రింద లోతైన బొరియలలో నివసిస్తాయి. పాము శరీర ఉష్ణోగ్రత దాని పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి నిర్ణయించబడుతుంది. నేల వాటిని తీవ్రమైన వేడి, చలి నుండి రక్షిస్తుంది. వర్షం పడినప్పుడు, బొరియలు నీటితో నిండిపోతాయి. అందువల్లే వర్షాలు, వరదల సమయంలో రక్షణ కోసం పాములు జనావాసాల్లోకి వచ్చి చేరుతుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి