Cobra Snake: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చొరబడ్డ అత్యంత విషపూరిత పాము.. చాకచక్యంగా బంధించిన మాజీ డీజీపీ..
విషయం తెలుసుకున్న రాజీవ్ త్రివేది పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం అటవీ అధికారులకు పామును అందజేశారు. సురక్షితంగా అడవిలో వదిలేయాలని రాజీవ్ త్రివేది అటవీ అధికారులను కోరారు.
ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లోకి భారీ త్రాచుపాము చొరబడింది. దాదాపు ఆరు అడుగుల పోడవైన త్రాచు పామును మరో ఐపీఎస్ అధికారి పట్టుకొని అటవీ అధికారులకు సురక్షితంగా అప్పగించారు. ఈ సంఘటన హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో చోటు చేసుకుంది. ప్రసాషన్ నగర్ లోని 199 ప్లాట్ ఇంట్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 14న వీరి ఇంట్లోకి దాదాపు ఆరు అడుగుల పొడవు ఉన్న త్రాచు పాము ప్రవేశించింది. దీంతో అదే కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ డీజీపీ రాజీవ్ త్రివేది కి సమాచారం అందించారు. రాజీవ్ త్రివేది తన పొరుగునే ఉన్న కృష్ణయ్య ఇంటికి చేరుకొని ఆ పామును నేర్పుతో బంధించారు.
హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నివాసంలోకి చొరబడిన త్రాచుపామును మాజీ డీజీపీ రాజీవ్ త్రివేది బంధించారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కృష్ణయ్య నివాసంలోకి ఆరు అడుగుల త్రాచుపాము చొరబడింది. విషయం తెలుసుకున్న రాజీవ్ త్రివేది పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం అటవీ అధికారులకు పామును అందజేశారు. సురక్షితంగా అడవిలో వదిలేయాలని రాజీవ్ త్రివేది అటవీ అధికారులను కోరారు. అత్యంత విషపూరితమైన పామును చాకచక్యంగా బంధించిన మాజీ డీజీపీపై ప్రశంసలు కురుస్తున్నాయి.