AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సినిమాల్లో ఛాన్సులిప్పిస్తామంటూ వారిని టార్గెట్ చేశారు.. ఏకంగా కోట్లను కొల్లగొట్టారు..

సినిమా.. అదో రంగుల ప్రపంచం. ఎలాగైనా వెండితెరపై వెలిగిపోవాలన్న తపన. సినిమాల్లో నటించాలన్నది వారి కల.

Hyderabad: సినిమాల్లో ఛాన్సులిప్పిస్తామంటూ వారిని టార్గెట్ చేశారు.. ఏకంగా కోట్లను కొల్లగొట్టారు..
Hyderabad News
Ravi Kiran
|

Updated on: Oct 14, 2022 | 5:15 PM

Share

సినిమా.. అదో రంగుల ప్రపంచం. ఎలాగైనా వెండితెరపై వెలిగిపోవాలన్న తపన. సినిమాల్లో నటించాలన్నది వారి కల. అదే వారిపాలిట శాపమైంది. సినిమాలో ఛాన్సులిప్పిస్తామంటూ కొందరు కోట్లలో మోసానికి తెరలేపారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో యువతను చీట్‌ చేసి కోట్లు గడించారు. సినిమా ఛాన్స్‌ లేకపోయినా సరే.. మా డబ్బు మాకివ్వమన్న బాధితులకు బెదిరింపులు ఎదురయ్యాయి.

తమకు కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులతో సంబంధాలున్నాయంటూ భయపెట్టినట్లు ఆవేదన చెందుతున్నారు బాధితులు. వందల మంది నుంచి ఆరుకోట్ల రూపాయలు గుంజినట్లు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారిబంధువులే టార్గెట్‌గా నయా చీటింగ్‌కు తెరదీశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్‌వెల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు.

RRR, అల వైకుంఠపురం, లవ్ స్టొరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది లాంటి సినిమాల్లో పెట్టుబడులు పెడతామని నమ్మించిన చీటర్స్‌.. నష్టాలొచ్చాయంటూ మొండిచేయి చూపడంపై బాధితులు మండిపడ్డారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌ తమను కోట్లలో ముంచారని ఆరోపిస్తున్నారు. తమ డబ్బు ఇప్పించాలంటూ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

బాధితుల ఆందోళనతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు ప్రధాన నిందితులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 30 మంది బాధితులే బయటకు వచ్చినప్పటికీ.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..