Shani Dev Puja: శని దేవుడికి ఈ వస్తువులను సమర్పించి పూజ చేయండి.. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 15, 2022 | 9:08 AM

ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్టే.. శని ప్రభావం ఉన్న వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతూ ఉంటుంది. అయితే శని దోషం నుండి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించాలి..

Shani Dev Puja: శని దేవుడికి ఈ వస్తువులను సమర్పించి పూజ చేయండి.. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది..
Shani Dev

Shani Dev Puja: శని దేవుడిని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. ఎవరి కర్మలకు ఎలాంటి ఫలాలు పొందాలో శని దేవుడే నిర్ణయిస్తాడు అంటారు. ఈ నేపథ్యంలోనే ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్టే.. శని ప్రభావం ఉన్న వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతూ ఉంటుంది. అయితే శని దోషం నుండి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించాలి.. అలా చేయడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు.. అంతేకాదు శని దేవుని ఆశీస్సులు ఉంటే అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. శనివారం నాడు శని దేవుడిని ఆరాధించడం ద్వారా అతను సంతోషిస్తాడని నమ్ముతారు. ఈ సందర్భంగా శని దేవుడుని ఎలా పూజించాలి.. ఏమి చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.. శని దేవుడిని పూజించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇలా చేయకపోతే శనిదేవుని అనుగ్రహం లభించదు.

ఆనందం.. శని దేవుడికి నువ్వులు, బెల్లం, ఖిచ్డీ సమర్పించండి. వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా శనిదేవుడు శాంతిస్తాడు..త్వరగా సంతోషిస్తాడని భావిస్తారు. దాంతో భక్తులపై అతని అనుగ్రహం నిలిచి ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో మీరు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శనివారం ఈ వస్తువులను సమర్పించండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

రాగి పాత్రలు.. పూజలో ప్రజలు తరచుగా రాగి పాత్రలను ఉపయోగిస్తారు. దేవుడి పూజ సమయంలో ఈ పాత్రలు శుభప్రదంగా ఉంటాయని నమ్ముతారు. అయితే, శని దేవుడిని పూజించేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించడం మర్చిపోవద్దు. రాగి సూర్యునికి సంబంధించినది.శని దేవుడికి శత్రువుగా పరిగణించబడుతుంది. శని దేవుడిని పూజించడానికి ఇనుప పాత్రలను ఉపయోగించండి. శని దేవుడిని పూజించేటప్పుడు నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఇనుప వస్తువులు సమర్పిస్తారు. దీంతోపాటు శనివారాల్లో నల్లరంగు వస్తువులను నిరుపేదలకు అందజేసే వాళ్లు కూడా ఉన్నారు. వీటిలో నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఆవాల నూనె కూడా శనివారం దానం చేయవచ్చు. శని దేవుడిని ఆరాధించే సమయంలో, పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. ఇలా చేయకపోతే శని దేవుడికి కూడా కోపం వస్తుంది.

పశ్చిమ దిశ.. శని దేవుడిని పూజించేటప్పుడు పడమర దిక్కును ఎంచుకోవాలి. శని దేవుడిని పశ్చిమ దిశకు అధిపతిగా భావిస్తారు. కాబట్టి ఈ దిశలో కూడా పూజలు చేయాలి. అయితే, పూజ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విషయం ఏమిటంటే..శనిదేవుడికి ఎదురుగా ఉండి ఎప్పుడూ పూజించకూడదు. అంటే, మీ ముఖం శనిదేవుడి కళ్లలో సూటిగా పడరాదు.

శ‌నివారం రోజున రావి చెట్టుకు నీరు పోసి ఆ చెట్టుకు న‌మ‌స్క‌రించి ఏడు సార్లు చెట్టు చుట్టూ తిర‌గాలి. శ‌నివారం రోజున పేద‌ల‌కు అన్నం పెట్ట‌డం వ‌ల్ల కూడా శ‌ని దేవుడు సంతోషిస్తాడని చెబుతూ ఉంటారు. ప్ర‌తి శ‌నివారం నూనె, న‌ల్ల నువ్వులు శ‌నిదేవుడికి స‌మ‌ర్పించాలి. వీటిని దానంగా ఇచ్చినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. నూనెను దానంగా ఇచ్చే ముందు శుభ్రంగా స్నానం చేసి ఒక గిన్నెలో నూనెను తీసుకుని దానిలో ముఖాన్ని చూసుకుని ఆ నూనెను దానంగా ఇవ్వాలి. శ‌ని దేవున్ని పూజించాలి. ఆయ‌న‌కు నీలం రంగు పువ్వుల‌ను స‌మ‌ర్పించాలి. అలాగే శ‌ని దేవున్ని పూజించేట‌ప్పుడు ఆయ‌న విగ్ర‌హం ఎదురుగా నిల‌బ‌డి పూజ చేయ‌కూడ‌దు. శ‌నిదేవున్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి సూర్యాస్త‌మ‌యం త‌రువాత రావి చెట్టు ద‌గ్గ‌ర దీపాన్ని వెలిగించాలి. ఒక‌వేళ రావి చెట్టు అందుబాటులో లేకుంటే ఏదైనా చెట్టు ద‌గ్గ‌ర కూడా దీపాన్ని వెలిగించ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి విముక్తి ల‌భిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu