Horoscope Today: ఈ రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.. శనివారం రాశిఫలాలు..
ఈరోజు వీరు మానసిక చంచలంతో ఇబ్బంది పడుతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు.
మేషరాశి.. ఈరోజు వీరు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది.. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రుణ బాధాలు తగ్గుతాయి. సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
వృషభ రాశి.. ఈరోజు కళాకారులకు.. మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
మిథునరాశి.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అవకాశాలను చేజార్చుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.
సింహరాశి.. ఈరోజు వీరు.. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు.
కన్య రాశి.. ఈరోజు వీరు వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది.
తుల రాశి.. ఈరోజు వీరు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు.
మకర రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
కుంభరాశి.. ఈరోజు వీరు కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి.
మీన రాశి.. ఈరోజు వీరు మానసిక చంచలంతో ఇబ్బంది పడుతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.