వామ్మో.. మహిళ కళ్ళలో ఏకంగా 23 ‘కాంటాక్ట్​ లెన్స్​’లను బయటకు తీసిన డాక్టర్​!..అసలేం జరిగిందో తెలిస్తే షాక్‌ అవుతారు..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Oct 14, 2022 | 4:32 PM

ఆ కాంటాక్ట్ లెన్స్‌ల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోను డాక్టర్ కాథెరిన్​కురటీవా అనే డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సెప్టెంబర్ 13న పోస్ట్ చేశారు.

వామ్మో.. మహిళ కళ్ళలో ఏకంగా 23 'కాంటాక్ట్​ లెన్స్​'లను బయటకు తీసిన డాక్టర్​!..అసలేం జరిగిందో తెలిస్తే షాక్‌ అవుతారు..
Contact Lens

Follow us on

ఇంటర్‌ నెట్‌ వినియోగం విపరీతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో ప్రజల్లో అరచేతిలో వాలిపోతుంది. అలాంటి వాటిలో చాలా వింత, విచిత్ర ఘటనలు అనేకం సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి అవి మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. మరికొన్ని సంఘటనలు నమ్మలేనివిగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కంటిలో నుంచి ఏకంగా 23 కాంటాక్ట్​ లెన్స్​లను బయటకు తీశారు వైద్యులు. ఇప్పుడి ఈ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాలిఫోర్నియాకి చెందిన ఒక మహిళకి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం అలవాటు. అలా ప్రతి రోజు వాటిని పెట్టుకుంటూనే ఉంది. కానీ వాటిని తీసేయడమే మర్చిపోయింది. అలా ప్రతి రోజు వాటిని తియ్యకుండానే కొత్త కాంటాక్ట్ లెన్స్ ధరిస్తూ వచ్చింది. ఇలాగే దాదాపు 23 లెన్స్ లు పెట్టుకుంటూనే ఉంది. అవన్నీ కంటి రెప్ప కింద ఉండిపోయాయి. ఒక రోజు కంట్లో నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. పరీక్షించిన డాక్టర్ ఆమె కంట్లో 23 లెన్స్ లు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ కాంటాక్ట్ లెన్స్‌ల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోను డాక్టర్ కాథెరిన్​కురటీవా అనే డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సెప్టెంబర్ 13న పోస్ట్ చేశారు. ఆ 23 కాంటాక్ట్ లెన్స్‌లను మహిళ కంటి నుండి తొలగించినట్లు వీడియో చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Ophthalmologist | Dr. Katerina Kurteeva M.D. | Newport Beach (@california_eye_associates)

డా. కాథెరిన్​ కురటీవా ఈ మేరకు తన ఇన్​స్టాగ్రామ్​ పేజ్​లో ఈ వీడియోను షేర్​ చేశారు.. వీడియోలో మహిళ కన్ను కనిపిస్తోంది. అందులో నుంచి ఆ డాక్టర్​.. కాంటాక్ట్​ లెన్స్​లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నట్టుగా కనబడుతోంది. ఇలా మొత్తం మీద 23 కాంటాక్ట్​ లెన్స్​లు బయటకొచ్చాయి. ఇది చూసి ఆ డాక్టరే షాక్​అయ్యారు. కంటి నుంచి తొలగించిన ఆ లెన్స్ ఆకుపచ్చ రంగులోకి మారిపోయి అతుక్కుని ఉన్నాయి. సెప్టెంబర్​ 13న ఈ వీడియోను అప్లోడ్​ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది. ఇప్పటికే 29లక్షల వ్యూస్​, 81వేల లైక్స్​ ఈ వీడియోకు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు. చాలా షాకింగ్​గా ఉంది’ అని ఓ నెటిజన్​ కామెంట్​ పెట్టగా, ‘ఆ మహిళ కాంటాక్ట్​ లెన్స్​ వాడకూడదు. కళ్ల జోడు పెట్టుకోవడం ఉత్తమం అంటూ మరో వ్యక్తి కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu