నాన్నకు ప్రేమతో.. బర్త్‌డే రోజు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు..మనుసును కట్టేపడేసిన వీడియో వైరల్‌

ఆ తండ్రి కొడుకులా ఈ ప్రేమను చూస్తే మీ కళ్లలో కూడా కన్నీళ్లు ఆగవు. అతని పుట్టినరోజు వైరల్ వీడియో మిమ్మల్ని కూడా కదిలిస్తుంది. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో

నాన్నకు ప్రేమతో.. బర్త్‌డే రోజు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు..మనుసును కట్టేపడేసిన వీడియో వైరల్‌
Son Surprises
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 14, 2022 | 3:31 PM

ఇంటర్నెట్‌లో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి కొన్ని క్షణాల్లో నెటిజన్ల మనసును కదిలించేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న క్లిప్‌లో ఒక వ్యక్తి తన పుట్టినరోజున తన కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు..అతడు ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తండ్రి కొడుకులా ఈ ప్రేమను చూస్తే మీ కళ్లలో కూడా కన్నీళ్లు ఆగవు. అతని పుట్టినరోజు వైరల్ వీడియో మిమ్మల్ని కూడా కదిలిస్తుంది. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో తండ్రి బర్త్‌డే వేడుకకు విదేశాల్లో ఉన్న కుమారుడు ప్రత్యక్షమై సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఈ వైరల్‌ వీడియోను జిందగీ గుల్జార్‌ హై అనే పేజ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ తండ్రి పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అందరూ హోటల్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటుండగా, యువకుడు సరాసరిగా ఆ టేబుల్‌ దగ్గరకు వెళ్లి తండ్రిని సర్‌ప్రైజ్‌ చేశాడు. చాలా రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చిన కుమారుడిని చూసిన ఆ తండ్రి ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రీ కొడుకుల కలయిక, ఆత్మీయ ఆలింగనం అక్కడున్న వారందరినీ కట్టిపడేసింది. బ్రదర్‌ కెనడా నుంచి వచ్చి తండ్రి బర్త్‌డే రోజున సర్‌ప్రైజ్‌ ఇచ్చాడని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

తండ్రి కొడుకుల అనురాగం, అప్యాయతలకు సంబంధించిన ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్‌, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు కూడా ఉద్వేగ భరితమై కామెంట్స్‌ చేస్తున్నారు. కొడుకు పట్ల తండ్రికి ఉన్న నిస్వార్ధ ప్రేమకు ఇది నిదర్శం అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..