High Hills: ఎత్తు చెప్పులు వేసుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ.. మీ కోసమే ఈజీ చిట్కాలు

అయితే, ఇవన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.  అలాంటి టైమ్‌లో నొప్పిని ఎలా నివారించాలో కూడా మీరు తెలుసుకోవాలి..అందుకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

High Hills: ఎత్తు చెప్పులు వేసుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ.. మీ కోసమే ఈజీ చిట్కాలు
High Hills
Follow us

|

Updated on: Oct 14, 2022 | 1:23 PM

ప్రతి ఒక్కరూ తమ డ్రెస్సింగ్‌ పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తుంటారు. వేసుకునే దుస్తుల నుంచి చెప్పులు, బూట్ల వరకు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. వేసుకునే డ్రెస్‌కు తగ్గట్టుగానే సరిపోయే బూట్లు కూడా అందంగా ఉండేలా చూసుకుంటారు. బట్టలు, బూట్లు ఈ రెండూ కలిపితేనే ఫ్యాషన్‌ పూర్తవుతుందంటారు. ఇందుకోసం చెప్పులు, బూట్లు వారికి నచ్చినవి కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ సమయం గడిపేందుకు ఓ రకం చెప్పులు, వాకింగ్‌ కోసం మరో చెప్పులు, పార్టీ వేర్, ఆఫీస్‌ వేర్‌, స్లిప్పర్స్‌ ఇలా రకా రకాల చెప్పులు వాడుతుంటారు. మార్కెట్ లో లభించే వివిధ రకాల హై హిల్స్, పెన్సిల్ హిల్స్ వంటి చెప్పులు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు అమ్మాయిలు. అయితే, ఇవన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. హై హిల్స్ చెప్పులను ఎక్కువసేపు వేసుకొని నడవడం, నిలబడ్డం చేయడంతో మడమల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. హిల్స్‌ కారణంగా మునివేళ్ల మీద అధిక ఒత్తిడి పడడంతో బొటనవేలు వంకర పోవడం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ మడమలు అరిగిపోవడం జరుగుతాయి. హై హిల్స్‌ వేసుకొని నడిచే సమయంలో జారిపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే కొత్త చెప్పులను ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు ఫ్యాషన్ కోసమే హీల్స్ ధరించాలి. అయితే, అలాంటి టైమ్‌లో నొప్పిని ఎలా నివారించాలో కూడా మీరు తెలుసుకోవాలి..అందుకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం…

ప్రతి ఒక్కరి పాదాల ఆకృతి భిన్నంగా ఉంటుంది. కొందరికి పొడవాటి కాళ్లు ఉంటే, మరికొందరికి పొట్టి కాళ్లు ఉంటాయి. కొందరికి పొడవాటి వేళ్లు ఉంటాయి. ఎవరికీ ఎలాంటి చెప్పులు, బూట్లు అనుకూలంగా ఉంటే, అదే విధంగా ఎంపిక చేయాలి. లేదంటే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. షూలో పాదం సౌకర్యవంతంగా సరిపోకపోతే నొప్పి కలుగుతుంది. పాయింటెడ్ హీల్స్ లేదా పెన్సిల్ హీల్స్ బాగుంటాయి. కానీ, వాటితో అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అయితే హై హీల్స్‌ కొనే సమయంలో వాటిని అక్కడే వేసుకొని ఒకసారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడవటం ట్రై చేయాలి. మీరు వేసుకోవడానికి ఆ చెప్పులు సౌకర్యంగా అనిపిస్తే అప్పుడు తీసుకోండి. కాలి మడమలు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఎత్తు చెప్పులను ఎంచుకోవడం మంచిది. పెన్సిల్ హిల్ వంటి చెప్పులను తీసుకోరాదు. ఇవి మడమల నొప్పికి కారణమవుతాయి. కాబట్టి మీరు ప్లాట్‌ హీల్స్, బ్లాక్ హీల్స్, క్యూబన్ హీల్స్ ధరించటం ఉత్తమం.

బూట్లు కొనుగోలు చేసేటప్పుడు ముందుగా మీ పాదాలను కొలవండి. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. చాలా బిగుతుగా ఉండే బూట్లు ధరించవద్దు. కొత్త చెప్పులు వేసుకునే సమయంలో కాస్త బిగుతుగా ఉంటాయి. దాంతో కాలి మీద దురద, మంట ఏర్పడి బొబ్బులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మొదట సాక్సులను ధరించి చెప్పులు వేసుకోవడం మంచిది. ఇలా చేయడంతో చెప్పులు కొద్దిగా వదులుగా అవుతాయి. ఇవి కాలి పాదాలకు ఎటువంటి హాని కలుగకుండా చేస్తుంది. ఇంకా చెప్పులు, షూస్‌ కొనుగోలు చేసేటప్పుడు అవి మీ కాళ్లకు మెత్తగా ఉండేలా ఎంచుకోవటం మర్చిపోవద్దు. టైట్‌ షూస్‌, పార్టీవేర్‌ హిల్స్‌ వేసుకున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మీ బూట్లు తీసివేసి మీ పాదాలకు మసాజ్ చేయండి. ఫలితంగా పాదాలు ఎర్రబడటం లేదటం వాపు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్స్ కి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..