Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney failure: నోటి దుర్వాసన.. ప్రమాదకర వ్యాధుల‌కు సంకేతం అని మీకు తెలుసా?

నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుందని చాలా మంది అనుకుంటారు. పరిశుభ్రత లోపించడం వల్ల నోటి దుర్వాసన వస్తుందని, అయితే, నోటి దుర్వాసన అనారోగ్య సమస్యలకు ఇదో ఒక లక్షణం కావచ్చు.

Kidney failure: నోటి దుర్వాసన.. ప్రమాదకర వ్యాధుల‌కు సంకేతం అని మీకు తెలుసా?
Bad Breath
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 14, 2022 | 9:07 AM

అనేక చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలు మన శరీరాన్ని వేధిస్తాయి. నోటి దుర్వాసన అనేది కూడా మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. చాలా మందికి నోటి దుర్వాసన అనేది ఆరోగ్య సమస్య కంటే ఆత్మగౌరవ సమస్యగా మారుతుంది. నోటి దుర్వాసన ఇతరులలో మీ విలువను మాత్రమే తగ్గిస్తుందని అనుకోకండి.. ఇది మీకు తెలియకుండానే మీ శరీరంలో రకరకాల వ్యాధులను కూడా కలిగిస్తుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుందని చాలా మంది అనుకుంటారు. పరిశుభ్రత లోపించడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అయితే, ఎప్పుడూ అపరిశుభ్రత కారణంగానే నోటి దుర్వాసన వస్తుందని తప్పుగా భావించరాదు. నోటి దుర్వాసన వల్ల మీ శరీరంలో కిడ్నీ వ్యాధులు, మధుమేహం, ప్రేగు సంబంధిత వ్యాధులు వంటి అనేక వ్యాధులు వస్తాయి. చెడు శ్వాస, నోటి దుర్వాసన అనారోగ్య సమస్యలకు ఇదో ఒక లక్షణం కావచ్చు. నోటి దుర్వాసన కిడ్నీ వ్యాధికి సంబంధించిన లక్షణాల్లో ఒకటి. మూత్రపిండాలను ప్రభావితం చేసే కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇది సంకేతం.

కిడ్నీ అనేది మన శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడానికి పనిచేసే ముఖ్యమైన అవయవం. శరీర ద్రవాలను సమతుల్యం చేయడంలో కిడ్నీ కూడా సహాయపడుతుంది. అయితే, కిడ్నీ పాడైపోయినప్పుడు శరీరంలో యూరియా పరిమాణం పెరుగుతుంది. ఇది నోటి దుర్వాసనకు దారి తీస్తుంది. నోటి దుర్వాసన కాకుండా యూరియా స్థాయిలు పెరగడంలో భాగంగా నోటిలో ఒక విచిత్రమైన రుచిని కూడా అనుభవించవచ్చు.

మూత్రపిండాల పనితీరు బలహీనమైనప్పుడు శరీరం అనవసరమైన ఖనిజాలను విసర్జించదు. ఇది రక్తంలోకి చేరి నోటి దుర్వాసన, రుచి వ్యత్యాసానికి కారణమవుతుంది. కానీ నోటి దుర్వాసనకు పరిశుభ్రత సరిగా లేకపోవడం, మూత్రపిండాల వ్యాధులు మాత్రమే కారణం కాదు. కడుపు సమస్యలు, చిగుళ్ల వ్యాధి వంటి అనేక కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన క్రమం తప్పకుండా మారుతున్నట్లయితే వైద్యుడిని సందర్శించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి