Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ధూమపానం చేసే అలవాటు ఉందా.. కంటి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించొచ్చు.. బీ అలర్ట్..

ప్రస్తుతం వేగంగా మారిపోతున్న సాంకేతికత కారణంగా లైఫ్ అంతా డిజిటల్ మయంగా మారింది. మనం ఎక్కువ సమయం స్క్రీన్ ల పైనే గడుపుతున్నారు. ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, ట్రావెలింగ్ అయినా స్క్రీన్ తోనే...

Health: ధూమపానం చేసే అలవాటు ఉందా.. కంటి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించొచ్చు.. బీ అలర్ట్..
Smoking
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 14, 2022 | 6:57 AM

ప్రస్తుతం వేగంగా మారిపోతున్న సాంకేతికత కారణంగా లైఫ్ అంతా డిజిటల్ మయంగా మారింది. మనం ఎక్కువ సమయం స్క్రీన్ ల పైనే గడుపుతున్నారు. ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, ట్రావెలింగ్ అయినా స్క్రీన్ తోనే గడపాల్సిన అవసరం ఉంది. కానీ తెరపై ఎక్కువ సమయం గడపడం మన కళ్లకు మంచిది కాదు. కంటి వ్యాధులు, అంధత్వం వంటి సమస్యల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. కంటి చూపు, దాని సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అక్టోబర్ 13, 2022న ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం జరుపుకుంటారు. కళ్ల సంరక్షణ కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. దీనితో పాటు ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఇది మీ కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడిపేటప్పుడు లేదా ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. సూర్యుని నుంచి విడుదలయ్యే హానికరమైన కిరణాలు మీ కళ్లను ప్రభావితం చేస్తాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కంప్యూటర్, మొబైల్ లేదా టీవీ ముందు పరిమిత సమయం గడపడానికి ప్రయత్నించండి- ఇవన్నీ మీ స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తాయి. ధూమపానం తీసుకోవడం వల్ల మీ ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. కండరాల క్షీణత వంటి అనేక ఇతర సమస్యలు వస్తాయి. ధూమపానం చేస్తే వెంటనే దానికి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.