Telangana Rains: తెలంగాణ రెయిన్ అలెర్ట్.. మూడు రోజులు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు..
తెలంగాణ అంతటా గడిచిన నాలుగైదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
ఇలా వర్షాలు తగ్గాయని అనుకునేలోపే.. మళ్లీ వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణ అంతటా గడిచిన నాలుగైదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ మూడు రోజుల వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయంటే..
ఇవాళ నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యదాద్ర భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే ఎల్లుండి వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..
నిన్న రాత్రి హైదరాబాద్‌లో సుమారు 4 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడమే కాదు.. రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. ఇక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..