AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్.. రజినీ, అల్లు అర్జున్‏తో సినిమాలు..

‏సినిమా పై ఆసక్తి.. అందుకే బ్యాంక్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నిర్మాతలు అంతగా పట్టించుకోలేదు. ఎన్నో అవమానాలు.. నువ్వేం చేస్తావ్ అని చులకన మాటలను తట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాడు. ఇప్పుడు అతడితో సినిమాలు చేసేందుకు స్టార్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..

Director : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్.. రజినీ, అల్లు అర్జున్‏తో సినిమాలు..
Lokesh
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2026 | 12:06 PM

Share

సినీరంగుల ప్రపంచంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎన్నో అవమానాలు, సవాళ్లు దాటుకుని ఓ గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఓవైపు స్టార్ కిడ్స్ భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చి.. రెండు చిత్రాలకే అదృశ్యమయ్యారు. మరోవైపు ప్రతిభను నమ్ముకుని.. సంవత్సరాలు కష్టపడి అవకాశాలు అందుకుని స్టార్స్ అయిన హీరోహీరోయిన్స్ ఉన్నారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఓ డైరెక్టర్ గురించి మీకు తెలుసా.. ? ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు అతడు సినీరంగంలోనే టాప్ డైరెక్టర్. కోలీవుడ్ టూ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోస్ ఆయనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

అతడు మరెవరో కాదు.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా నటించిన నగరం సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రతి చోట తనకు అవమానాలు, నిరాశలే ఎదురయ్యాయి. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమాతో లోకేష్ కెరీర్ మారిపోయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సౌత్ ఇండస్ట్రీలో లోకేష్ పేరు మారుమోగింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆ తర్వాత వచ్చిన సినిమా మేకింగ్ నే మార్చేసింది. ఆ మూవీ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోస్ క్యూ కడుతున్నారు. సినిమాల్లోకి రాకముందు బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసేవారు. సినిమాపై ఆసక్తితో బ్యాంక్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో దూసుకుపోతున్నారు. లోకేష్ తన రాబోయే చిత్రం అల్లు అర్జున్ తో చేయనున్నారని సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us