Andhra Pradesh: ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలకు షాక్‌.. ఆ జీవోలను ఉపసంహరించుకున్న సర్కార్‌

సుప్రీం రూల్స్‌ ప్రకారం, ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరించాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌.

Andhra Pradesh: ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలకు షాక్‌.. ఆ జీవోలను ఉపసంహరించుకున్న సర్కార్‌
Ap High Court
Follow us
Basha Shek

|

Updated on: Oct 13, 2022 | 9:39 PM

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తూ ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకుంది ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు రూల్స్‌కి విరుద్ధంగా ప్రభుత్వం కేసులను ఉపసంహరించిందంటూ హైకోర్టులో పిల్‌ దాఖలవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా.. వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులపై వివిధ కేసులు నమోదు చేసింది అప్పటి ప్రభుత్వం. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు జీవోలు ఇచ్చింది. అయితే, ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీం రూల్స్‌ ప్రకారం, ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరించాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్‌. దీంతో హైకోర్టు అనుమతి తీసుకోకుండా ఎలా కేసులను ఉపసంహరిస్తారంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది న్యాయస్థానం. కేసుల విత్‌డ్రాపై వివరణ ఇవ్వాలని, కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఇష్టానుసారంగా ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.

కాగా సుప్రీం ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే, అన్ని పెండింగ్‌ కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్‌. ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఆ కేసులన్నీ మళ్లీ ఉనికిలోకి రావడంతో ప్రజాప్రతినిధులకు షాక్‌ తగిలినట్లయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్