Festival Fasting Tips: గర్భణీ స్త్రీలు ఉపవాసం చేస్తున్నారా.. అయితే ఆరోగ్య రక్షణ కోసం ఈ చిట్కాలు తెలుసుకోండి..
గర్భధారణ సమయంలో మహిళలు తమకు, తమకు పుట్టబోయే బిడ్డకు పుష్కలంగా నీరు, సమతుల్య పోషణ అవసరం. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు ఉపవాసం చేయడానికి నిరాకరిస్తారు. అయితే కొందరు మహిళలు.. మాత్రం తమ విశ్వాసాలను పాటిస్తూ.. గర్భధారణ సమయంలో ఉపవాసాన్ని పాటిస్తారు.
పండగలు, పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. చాలా మంది మహిళలు పూజాదికార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉపవాస దీక్షను చేపడతారు. రానున్నది కార్తీక మాసం.. శివకేశవులకు ఇష్టమైన నెల. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాలు, ఉపవాసం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం. అయితే ఉపవాసం చేయడం గర్భిణీ స్త్రీలకు సమస్య కావచ్చు. గర్భిణీ స్త్రీలు శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. కనుక కొన్ని సార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కనుక ఉపవాసం పాటించమని సలహా ఇవ్వరు. గర్భధారణ సమయంలో మహిళలు తమకు, తమకు పుట్టబోయే బిడ్డకు పుష్కలంగా నీరు, సమతుల్య పోషణ అవసరం. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు ఉపవాసం చేయడానికి నిరాకరిస్తారు. అయితే కొందరు మహిళలు.. మాత్రం తమ విశ్వాసాలను పాటిస్తూ.. గర్భధారణ సమయంలో ఉపవాసాన్ని పాటిస్తారు. గర్భవతి అయిన మహిళలు ఉపవాస దీక్ష సమయంలో గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..
గర్భిణీ స్త్రీలకు ఉపవాస చిట్కాలు:
*ఉపవాసం ఉన్నప్పుడు శక్తి తక్కువగా ఉంటుంది. కనుక తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.
*గర్భధారణ చివరి మూడు నెలల్లో ఉపవాసం ఉంటే అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఈ సమయంలో 200 అదనపు కేలరీలు అవసరమవుతాయి.
*వైద్యులు సూచించిన విధంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏదైనా ఆరోగ్యంలో తేడా అనిపిస్తే.. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.
గర్భిణీ మహిళలు పాటించాల్సిన ఆహార నియమాలు:
* గర్భధారణ సమయంలో సమతుల్య ఆహారం ఖచ్చితంగా అవసరం. అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవచ్చు కానీ పండ్ల రసం లేదా ఏదైనా ఆరోగ్యకరమైన పానీయం వంటి ద్రవాలతో ఉపవాసాన్ని విరమించవచ్చు.
*ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాలను పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తారు.
* గోధుమ పాస్తా, ఓట్స్, ఆధారిత తృణధాన్యాలు, బీన్స్, పప్పులు, ఉప్పు లేని మొలకలు, హోల్‌మీల్ బ్రెడ్ వంటి ఆహారాలను తినవచ్చు. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. *కాటేజ్ చీజ్, బీన్స్ , కాయధాన్యాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు బెస్ట్ ఎంపిక. ఇవి ఆకలిని ఎక్కువసేపు కలిగించవు.
* కాఫీ లేదా కెఫిన్ ఉన్న ఆహారపదార్ధాలకు దూరంగా ఉండండి. ఇవి మిమ్మల్ని మరింత నిర్జలీకరణం చేస్తాయి.
* జీర్ణం కావడం కష్టంగా ఉండే ఆహారపదార్ధాలు దూరంగా ఉండండి.
* చాక్లెట్లు/క్యాండీలు వంటి చక్కెర పదార్థాలు శక్తిని పెంచుతాయి.. అయితే ఉపవాస సమయంలో ఇవి హానికరం.
ఉపవాస సమయంలో ఏర్పడే సమస్యలు: *ముదురు రంగు మూత్రం, కళ్లు తిరగడం లేదా బలహీనత, తలనొప్పి అనిపిస్తే.. ఇవి నిర్జలీకరణ సంకేతాలుగా భావించండి.
*నిర్జలీకరణం .. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి కారణం కావచ్చు. గర్భధారణ సమయంలో.. మహిళలు యూరినరీ ఇన్ఫెక్షన్ కు లోనవుతారు.
* మీరు బరువు తగ్గుతున్నట్లయితే.. బరువు తగ్గకుండా ఉండే విధంగా ప్రయత్నించండి. డాక్టర్‌తో మాట్లాడండి. గర్భవతిగా ఉన్నప్పుడు బరువు తగ్గడం మంచిది కాదు
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)