Diabetes Cure: మధుమేహానికి ఆయుర్వేదంతో చికిత్స సాధ్యమే.. ఈ మెడిసిన్‌తో జస్ట్ ఇలా చేయండి..
ఇంగ్లీషు మందులు నయం చేయలేని అనేక వ్యాధులకు ఆయుర్వేదంలో చికిత్స చేయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.. అంతే కాదు ఎగిరి గంతేస్తారు. ప్రపంచంలో ఎవరు తగ్గించని డయాబెటిక్‌కు భారతీయ ఆయుర్వేదంతో చెక్ పెట్టొచ్చని..
డయాబేటిక్ అనగానే అంతా హడలిపోతారు. ఎందుకంటే నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో షుగర్ వ్యాధి నయం చేయలేనిదిగా పరిగణించబడుతుంది. అయితే, ఆయుర్వేద వైద్య విధానం ద్వారా రోగులకు వైద్యం చేసే వైద్యులు దీనిని పూర్తిగా అంగీకరించరు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం, డయాబెటిస్ వ్యాధిని అనేక పద్దతుల్లో పూర్తిగా నియంత్రించవచ్చని.. అంతే కాదు నయం చేయవచ్చని ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఆపరేషన్లు, యంత్రాలు ఉపయోగించకుండా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఆయుర్వేద వైద్యంలో ఇటువంటి ప్రక్రియలు ఉందంటున్నారు. అనుభవజ్ఞుడైన ఆయుర్వేద వైద్యుని నుంచి చికిత్స పొందడం ద్వారా మీరు షుగర్ సమస్యను ఎలా వదిలించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
డయాబెటిక్‌ను ఆయుర్వేదంలో మధుమేహం అంటారు. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం సమస్య వస్తుందని మనందరికీ తెలుసు. చరక సంహిత, సుశ్రుత సంహితలో మధుమేహానికి చికిత్స గురించి వివరించబడింది. ఈ రెండు ఆయుర్వేద గ్రంధాల్లో ఏం చెప్పబడిందో ఓసారి చూద్దాం. వీటి ద్వారా ఆయుర్వేద చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకవచ్చు. దీని ద్వారా మీరు లేదా మీ ప్రియమైనవారిని ఈ చికిత్సతో ఆరోగ్యంగా మారవచ్చు.
ఆయుర్వేదంతో చక్కెర వ్యాధికి చికిత్స..
- శరీరంలోని జీవక్రియ వ్యవస్థలో సమస్యల వల్ల మధుమేహం అనే వ్యాధి వస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. జీవక్రియ అనేది శరీరంలో ఒక ప్రక్రియ.. ఈ సమయంలో శరీరం వాటి నుంచి శక్తిని పొందేందుకు ఆహారం నుంచి పోషకాలను ఉపయోగిస్తుంది.
- జీవక్రియలో ఆటంకం ఏర్పడినప్పుడు.. శరీరంలో ఉన్న ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది లేదా శరీరం లోపల ఈ హార్మోన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది.
ఆయుర్వేదంలో డయాబెటిస్ చికిత్స ఎలా.. ?
- ఆయుర్వేద వైద్య విధానంలో అనేక విభిన్న చికిత్సా పద్ధతులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి రోగికి జీవక్రియ సరిచేయబడుతుంది. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ప్రత్యేకత ఏంటంటే ఇది వ్యాధిపై కాకుండా వ్యాధికి గల కారణాలను తొలగించడంలో పనిచేస్తుంది. తద్వారా వ్యాధిని మూలం నుంచి తొలగించవచ్చు. రోగి పదే పదే మందులు తీసుకోవలసిన అవసరం లేదు.
- ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికి మూడు దోషాలలో ఒకటి కారణం అని చెప్పింది. ఈ దోషాలను “వాత, పిత్త, కఫ” అని పిలుస్తారు. ఇది మధుమేహం విషయంలో కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి రకాన్ని బట్టి వాత ప్రమేహ, పిత్త ప్రమేహ, కఫ ప్రమేహ అని అంటారు.
- కఫా పెరగడం వల్ల మధుమేహం వస్తే అది పూర్తిగా నయం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. ఇది పెరిగిన పిత్త వల్ల సంభవించినట్లయితే.. దానిని నియంత్రించవచ్చు. కానీ వాత తీవ్రత కారణంగా ఇది సంభవిస్తే అది నయం కాని వ్యాధి అని.. అయినప్పటికీ మందులు, ఆహారం, జీవనశైలి ద్వారా రోగి జీవితాన్ని సాఫీగా చేయవచ్చని ఆయర్వేదం ద్వారా చెప్పబడింది.
ఈ మందులతో మధుమేహానికి చికిత్స..
- గుడుచి
- అమలకి
- నిషా అమలకి
- గుడ్మార్
- ఫాల్త్రికాడి క్వాత్
- మెంతికూర
- కటకఖ్దిరది కషాయ్
- నిషా కటకదీక్షాయ్
- కరవెల్క
మధుమేహం రావడానికి ప్రధాన కారణం ఏంటి?
ఆయుర్వేదం ప్రకారం మధుమేహానికి ప్రధాన కారణాలు..
- సరైన ఆహారం లేకపోవడం.. సరైన ఆహారం తీసుకోకపోవడం
- పేలవమైన జీవనశైలి అంటే నిద్ర లేమి, తినడం-తాగడం, కూర్చున్నప్పుడు ఎలాంటి అలసత్వం పాటించకపోవడం
- శరీరంలో కఫా స్వభావం అభివృద్ధి.
- కాలుష్యం ఉన్న ప్రదేశంలో నివసించడం.
- శారీరకంగా చురుకుదనం లేకపోవడం
- తప్పుడు మందులు దీర్ఘకాలిక వినియోగం
- జన్యుపరమైన కారణాల వల్ల కూడా మధుమేహం వస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం..