AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Protein Foods: సన్నగా పీలగా ఉన్నారా.. అయితే ఈ ఆహారంతో ఆ సమస్యకు చెక్ పెట్టండి.. శాఖాహారులకు అద్భుతమైన ప్రోటీన్‌ ఫుడ్ ఇదే..

శాకాహార ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని శాకాహారులు తినవచ్చు.

Best Protein Foods: సన్నగా పీలగా ఉన్నారా.. అయితే ఈ ఆహారంతో ఆ సమస్యకు చెక్ పెట్టండి.. శాఖాహారులకు అద్భుతమైన ప్రోటీన్‌ ఫుడ్ ఇదే..
Best Protein Rich Foods
Sanjay Kasula
|

Updated on: Oct 14, 2022 | 1:23 PM

Share

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన మోతాదులో ప్రొటీన్లు కావాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) అందించిన సమాచారం ప్రకారం, మగవారికి ప్రతిరోజూ 50 గ్రాముల ప్రోటీన్ అవసరం. మహిళలకు రోజుకు 46 గ్రాముల ప్రోటీన్ అవసరం. గర్భిణీ, పాలిచ్చే స్త్రీలకు రోజుకు 72 గ్రాముల ప్రోటీన్ అవసరం. శరీరంలో ప్రొటీన్ లేకపోవడం వల్ల చర్మంలో వాపు, పొట్టలో వాపు, జుట్టు పొడిబారడం, ఎముకలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు మన శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. శరీరంలో మాంసకృత్తులు లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారి ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రొటీన్‌ లేకపోవడం వల్ల కాలేయం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రొటీన్ లేకపోవడం వల్ల కాలేయంపై కొవ్వు పెరిగి ఫ్యాటీ లివర్‌గా మారుతుంది.

మాంసాహారం తీసుకోనివారి శరీరంలో ప్రొటీన్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. శాకాహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు లేవని కాదు. శాకాహార ఆహారంలో ప్రొటీన్‌తో కూడిన అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు.

శాఖాహారులు పప్పు తినాలి:

శాకాహారులు పప్పులు ఆహారంలో తీసుకోవాలి. దీంతో ప్రొటీన్ల కొరత తీరుతుంది. అరకప్పు వండిన పప్పులో 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.

చీజ్ తినండి:

శాకాహారులు తమ ఆహారంలో కాటేజ్ చీజ్ తీసుకోవాలి. పనీర్ ప్రోటీన్ మంచి బ్యాంక్ అని చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.

వోట్స్ కూడా ప్రోటీన్లకు మూలం:

అరకప్పు ఓట్స్‌లో 6 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల ఫైబర్, మెగ్నీషియం, జింక్, భాస్వరం, ఫోలేట్ ఉన్నాయి, ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తీరుస్తుంది.

చియా విత్తనాలు తినండి:

పోషకాలు అధికంగా ఉండే చియా సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోటు తీరుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి, అర కప్పు చియా గింజల్లో 6 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఐరన్, క్యాల్షియం, సెలీనియం, మెగ్నీషియం మంచి మూలం ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

డ్రై ఫ్రూట్స్ తినండి:

ఆహారంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి, మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రోటీన్ లోపాన్ని తీరుస్తుంది. మీరు అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..