Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Colour: ఆ కలర్ కారు ఎక్కువ ప్రమాదానికి గురవుతుందట.. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంచలన రిపోర్ట్.. ఆనంద్‌ మహీంద్ర రియాక్షన్‌

కొంతమంది తెల్లటి కార్లను ఇష్టపడతారు. మరికొంత మంది ముదురు రంగు కార్లను ఇష్టపడతారు. కానీ, మీకు తెలుసా? కారు రంగు కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని..

Car Colour: ఆ కలర్ కారు ఎక్కువ ప్రమాదానికి గురవుతుందట.. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంచలన రిపోర్ట్.. ఆనంద్‌ మహీంద్ర రియాక్షన్‌
Car Colour
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 14, 2022 | 10:42 AM

ప్రస్తుతం పండుగల సీజన్‌ నడుస్తోంది. కాబట్టి మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ దీపావళి మంచిది. కానీ, మీకు తెలుసా? కారు కొనేటప్పడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..ఏ రంగు కారు కోనాలో వంటి విషయాలపై అవగాహనం అవసరం అంటున్నారు నిపుణులు. మధ్యతరగతి కుటుంబానికి కారు కొనడం అనేది అతి పెద్ద డీల్. ఆ కారు కొనడానికి ఎన్ని రోజుల నుంచి సేవింగ్స్ దాచిపెట్టారో వారికి మాత్రమే తెలుసు. కాబట్టి.. అంత విలువైన కారుని కొనేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. అలాగే, కార్లలో కొన్ని రంగులు ఎక్కువ ప్రమాదాలకు కారణంగా మారుతాంటున్నారు. దీనికి సంబంధించి వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్) నివేదిక తాజాగా వెలువడింది. మరి ఈ రిపోర్ట్ ఏం చెబుతుందో తెలుసుకుందాం…

దీపావళి పండగ వేళ్లలో చాలా మంది కొత్త కారు లేదా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేస్తారు. ఏ కంపెనీ కారు కొనాలి? ఇది పెట్రోల్, డీజిల్ లేదా CNG? కారు మైలేజ్ ఎంత? ఇది మీ బడ్జెట్‌కు సరిపోతుందా? ఇలాంటి సందేహలు చాలా మంది కారు కొనే సమయంలో అడుగుతారు. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, కారు కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మొదట కారు రంగును పరిగణనలోకి తీసుకోవాలి. కొంతమంది తెల్లటి కార్లను ఇష్టపడతారు. మరికొంత మంది ముదురు రంగు కార్లను ఇష్టపడతారు. కానీ, మీకు తెలుసా? కారు రంగు కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ (వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్) దీనిపై నివేదిక సమర్పించబడింది. ముదురు రంగు కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తన ట్విట్టర్ ఖాతాలో దీని గురించి సమాచారం ఇచ్చింది.

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం… బ్లాక్ కలర్ కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. నల్లటి కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం 47 శాతం. గ్రే కలర్ కారులో 11 శాతం, సిల్వర్ కలర్ కారులో 10 శాతం, రెడ్ కలర్ కారులో 7 శాతం ప్రమాదం ఉంది. వైట్ కలర్ కార్ల వల్ల ప్రమాదాలు తక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది. తెలుపు రంగు కార్లు తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. దీని తరువాత, పసుపు, నారింజ బంగారు రంగుల కార్లు కూడా ప్రమాదాలకు తక్కువ అవకాశం ఉందంటూ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొంది. దీంతో ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేచింది.. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికపై కొత్త వివాదం తలెత్తే అవకాశం ఉంది.

మన దేశంలో కార్లను కొనుగోలు చేసే 10 మందిలో 4 మంది తెల్ల కార్లను ఇష్టపడుతున్నప్పటికీ, మహింద & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక తర్వాత.. మహింద & మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదికను ఆనంద్ మహీంద్రా ఇది ఒక తప్పుడు సమాచారంగా అభివర్ణించారు. ఈ సమాచారం తప్పు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో తెలిపారు. ఈ తప్పుడు సమాచారం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. మేము ఈ నివేదికను ఆమోదింలేమన్నారు.

కానీ మన దేశంలో కార్లను కొనుగోలు చేసే 10 మందిలో నలుగురు తెల్ల కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అదే సమయంలో, ఆటోమోటివ్ OEM కోటింగ్‌ల కోసం BASF యొక్క కలర్ రిపోర్ట్ 2021 ప్రకారం, భారతదేశంలో 40 శాతం మంది ప్రజలు తెల్లటి కార్లను ఇష్టపడతారు. ముదురు రంగు కార్లను ఇష్టపడే కస్టమర్ల సంఖ్య 15 శాతంగా ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి