ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది.. అదేంటో తెలుసుకోండి..

ఇంట్లోని పూజగదిని, శుభ్రంగా ఉంచడమే కాకుండా వంటగదిని కూడా అంతే శుభ్రంగా చూసుకుంటాం. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం కూడా దేవతలు, పూర్వీకుల రాకకు అంతే ముఖ్యమైనది.

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేస్తుంది.. అదేంటో తెలుసుకోండి..
Home
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 14, 2022 | 1:58 PM

ప్రజలంతా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుంటారు. అందులోనూ పూజగదిని, వంటగదిని అత్యంత పరిశుభ్రంగా చూసుకుంటారు. ఎటువంటి దుమ్మును, దూళి లేకుండా ఎప్పటికప్పుడు వాటిని సర్దుకుంటుంటారు. ఈ రెండు ప్రదేశాలు మిగిలిన ఇంటి కంటే ఎక్కువ శుభ్రంగా పెడతారు. ఎందుకంటే, ఇంట్లోని ఈ రెండు ప్రదేశాలు లక్ష్మీ దేవి నిలయంగా భావిస్తారు. ధన లక్ష్మిని సంతోషపెట్టడం వల్ల ఇతర దేవతలు కూడా ఇక్కడ నివసిస్తారని భావిస్తారు.. అయితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం మరొకటి కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ స్థలాన్ని కూడా శుభ్రం ఉంచుకోవడం అవసరం. అందేంటో తెలుసా..? పూజగది, వంటగది కాకుండా దేవతలు, పూర్వీకులు ఇంట్లోకి ప్రవేశించే మరో ప్రదేశం ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లోని పూజగదిని, శుభ్రంగా ఉంచడమే కాకుండా వంటగదిని కూడా అంతే శుభ్రంగా చూసుకుంటాం. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం కూడా దేవతలు, పూర్వీకుల రాకకు అంతే ముఖ్యమైనది. ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారా మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొందరు తమ ఇంటి మెయిన్ డోర్ వైపుకి నేరుగా నెయ్యి దీపం వెలిగించడానికి ఇదే కారణం అంటున్నారు నిపుణులు. అటువంటి పరిస్థితిలో ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రధాన ద్వారం శుభ్రం చేయకున్నా లేదా మురికిగా ఉంచినా.. దేవతలు ఇంట్లోకి ప్రవేశించి బయటి నుంచి తిరిగి వెళ్లిపోతారని నమ్మకం. ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు. ఇక్కడ నుండి ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఈ స్థలం నుండే ఇంట్లో నివసించే సభ్యుల జీవితం నిర్ణయించబడుతుంది.

మెయిన్ డోర్ సరిగా లేకుంటే ఇంట్లో సంతోషం ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా, పరిపూర్ణంగా ఉంచడానికి, కొన్ని వస్తువులను ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నారు.. ఈ వస్తువులను సరైన పద్ధతిలో వాడితే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవటం మంచిదని చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. అంతే కాకుండా మెయిన్ డోర్‌కి ఎప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం. అంతేకాదు..అప్పటికే ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోంచి బయటకు వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఎరుపు రంగు స్వస్తిక్ పూయడం వల్ల ఇంటి వాస్తు, దిశ దోషాలు తొలగిపోతాయి. ప్రధాన ద్వారం మధ్యలో నీలిరంగు స్వస్తికాన్ని ఉంచడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచుతారు.

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..