AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch video: చూడగానే గిన్నెలు కిడిగే స్క్రబ్బర్ అనుకుంటారేమో ..! మరీ అసలు విషయం తెలిస్తే అవాక్ అవుతారు..

ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల కేక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా వివిధ ఆకృతులలో కేక్‌లు లభిస్తుంటాయి.

Watch video: చూడగానే గిన్నెలు కిడిగే స్క్రబ్బర్ అనుకుంటారేమో ..! మరీ అసలు విషయం తెలిస్తే అవాక్ అవుతారు..
Dish Washing Sponge
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2022 | 4:56 PM

Share

ఫుడ్స్‌కి చాలా వెరైటీని తీసుకొచ్చే వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూస్తుంటాం. ఏదైనా చూడగానే తయారు చేసి తినాలనిపిస్తుంది. కానీ, కొందరు తయారు చేసే చిత్ర విచిత్రమైన వంటకాలు చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది. ఉత్తర భారతీయులు తమ వంటకాలతో ప్రయోగాలు చేస్తూ వివిధ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటారు. అలాంటిదే ఇక్కడ మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఓరీ దేవుడో ఇదేం వంటకం రా సామీ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

కేక్ అంటే అందరికీ ఇష్టమైన స్వీట్‌. బర్త్ డే అయినా, మరే ఇతర ఈవెంట్ అయినా అందరూ ఇంట్లో కేక్ కొంటారు లేదా తయారు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల కేక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా వివిధ ఆకృతులలో కేక్‌లను తయారు చేయవచ్చు. ఓ విభిన్నమైన కేక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ కేక్ ఎలా వైరల్ అవుతుందో అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చూస్తే మీరు షాక్ అవుతారు. ఇది డిష్ వాష్ స్పాంజ్ ఆకారంలో ఉండే కేక్. కేక్ ఆకుపచ్చ మరియు పసుపు రంగు స్పాంజ్ రూపంలో తయారు చేయబడింది. స్పాంజ్ పైన కూడా సబ్బు నురగ లాగా తయారు చేశారు. ఒక వ్యక్తి దానిని కోసి తింటున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇది చూసి సోషల్ మీడియా మొత్తం షాక్ అయ్యింది. కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. ఎలా తింటారు అనే ప్రశ్నను చాలా మంది అడిగారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా makanterusss షేర్ చేసింది. ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఇటీవలే డార్క్ చాక్లెట్ విత్‌ మ్యాగీ తయారీ చూసిన నెటిజన్లు దాన్ని కూడా అసహించుకున్నారు. డార్క్‌ చాక్టెల్‌ విత్‌ మ్యాగీలో తయారీలో మ్యాగీని నీటిలో కాకుండా పాలలో ఉడకబెట్టారు. మ్యాగీ మెత్తబడిన తర్వాత అందులో డార్క్ చాక్లెట్‌ను కలిపేశారు. ఇది మ్యాగీ రంగును చాక్లెట్ రంగుగా మార్చడమే కాకుండా, దాని రుచిని కూడా మార్చేసింది. తయారీదారు ఈ వంటకాన్ని వండిన తర్వాత రుచికరంగా ఉందంటూ ఆస్వాధించిన తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. మ్యాగీ వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్‌తో మండిపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?