ట్రెండ్ సెట్ చేస్తున్న రైతులు.. పంట పొలాల్లో ప్రత్యక్షమైన తమన్నా, రాశీఖన్నా.. అదిరిందయ్యా..!
సాధారణ ప్రజలు, రైతులు జంతువుల బెడదతో అవస్థలు పడుతున్నారు. ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తున్న జంతువులు, పక్షుల బారినుంచి రక్షించుకోవటానికి రకరకాల ఉపాయాలు చేస్తున్నారు.
అడవులు అంతరించిపోవటంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దాంతో సాధారణ ప్రజలు, రైతులు జంతువుల బెడదతో అవస్థలు పడుతున్నారు. ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తున్న జంతువులు, పక్షుల బారినుంచి రక్షించుకోవటానికి రకరకాల ఉపాయాలు చేస్తున్నారు. పూర్వకాలం పద్దతులకు స్వస్తి చెబుతూ రైతులు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగానే వింత వింత ఆలోచనలతో సరి కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో రైతులు అధికంగా టమాటను సాగు చేస్తారు. తంబళ్లపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మల్‌రెడ్డి తనకున్న అర ఎకరా పొలంలో టమాట సాగు చేపట్టారు. అయితే, పక్షులు, కోతులు ఇతర జంతువులు వచ్చి పండిన టమాటాను చేతికి రాకుండా చేస్తుండటంతో అదిరిపోయే ఐడియా వేశాడు.
సాధారణంగా, రైతులు పొలాల మధ్యలో గడ్డితో తయారు చేసిన దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే, పక్షులు, జంతువులు ఆ బొమ్మలను చూసి మనుషులే పొలాల్లో కాపాలాగా ఉన్నారని భావించి భయంతో ఆ పక్కకు రాకుండా ఉండేవి. ఇదే పద్ధతి పూర్వం నుంచి వస్తుంది. అయితే అన్నమయ్య జిల్లాకు చెందిన రైతు మల్‌రెడ్డి చేసిన వింత ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. భలే ఐడియా గురూ అంటూ స్థానికులతో పాటు చుట్టు పక్కల జనాలు, రైతులు మల్‌రెడ్డిని తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
తంబళ్లపల్లె మండలం రెడ్డివారిపల్లెలో మల్రెడ్డి తనకున్న అర ఎకరం భూమిలో టమోటా సాగు చేశాడు. మొక్కలు పొడవుగా పెరిగి బాటసారులను ఆకర్షిస్తున్నాయి. పంటకు దిష్టి తగులుతుందని రైతు భయపడ్డాడు. అందుకే తన పొలానికి నాలుగు వైపులా హీరోయిన్లు తమన్నా, రాశీఖన్నా హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టాడు. దీంతో అటు పక్షులు, జంతువుల నుంచి కూడా రక్షణగా ఉందంటున్నాడు. అలాగే కురబలకోట మండలం దాడంవారిపల్లెకు చెందిన మరో రైతు లీలమ్మ కూడా తాను వేసిన అర ఎకరా టమట, బంతిపూలను సాగు చేస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు పలువురు కథానాయికల పోస్టర్లను ఏర్పాటు చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి