Monkey riding: జింకపై కోతి హై హై నాయకా.. ఐఐటీ కాలేజ్‌లో అరుదైన దృశ్యం.. వీడియో హల్‌చల్‌

జింకపై స్వారీ చేస్తున్న కోతిని ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

Monkey riding: జింకపై కోతి హై హై నాయకా.. ఐఐటీ కాలేజ్‌లో అరుదైన దృశ్యం.. వీడియో హల్‌చల్‌
Monkey Riding A Deer
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 15, 2022 | 12:10 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు జనాల్ని షాక్‌ అయ్యేలా చేస్తాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇంటర్‌నెట్‌లో కొన్ని వీడియోలు నెటిజన్లకు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ముఖ్యంగా కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే జంతువుల వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోలు చూసి నవ్వకుండా ఉండలేరు. జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, అల్లరి పనులు ప్రజల్లో ఒత్తిడి తగ్గించేందుకు, నిరాశకు దివ్యౌషధంగా చెప్పాలి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

జింకపై స్వారీ చేస్తున్న కోతిని ఎప్పుడైనా చూసారా? కాకపోతే ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) క్యాంపస్‌లో తీసిన ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వీడియోలో క్యాంపస్‌లో ఒక జింక గడ్డి మేస్తూ కనిపిస్తోంది. జింకపై హాయిగా కూర్చున్న కోతి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తోంది. దానిపై కోతి స్వారీ చేసినా జింక ఏమాత్రం బెదరలేదు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారడమే కాకుండా నెటిజన్ల నుండి విపరీతమైన ప్రశంసలు అందుకుంది. ఐఐటీ మద్రాస్‌లో కోతులు ఇలా ఉంటాయని కొందరంటే, మరికొందరు కోతులు మనుషుల్లా జంతువులను ఎలా స్వారీ చేస్తాయని ఆశ్చర్యపోతున్నారు. ఇది ఐఐటీ క్యాంపస్ లో కోతి కాబట్టి.. చాలా తెలివైనదని మరొక నెటిజన్‌ ఫన్నీ కామెంట్‌ చేశారు..

IIT మద్రాస్ క్యాంపస్ చెన్నైలోని గిండీ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. కాలేజ్‌ క్యాంపస్‌లో ఎక్కువ భాగం రక్షిత అటవీ ప్రాంతం. కాబట్టి అక్కడ క్యాంపస్‌లో జింకలు, కోతులతో సహా అనేక రకాల జంతువులను చూడటం సర్వసాధారణం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?