Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Paper: న్యూస్‌ పేపర్‌ చివర్లో ఈ నాలుగు రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా.? పెద్ద కారణమే ఉందడోయ్‌..

ఏ వార్త పత్రికలను గమనించినా చివర్లో నాలుగు రంగులు కనిపిస్తుంటాయి. ప్రతీ పేజీలో ఈ రంగులు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది న్యూస్‌ పేపర్‌ చదివినా ఎప్పుడూ ఆ రంగులు ఏంటని ఆలోచించి ఉండరు. అయితే ఏ కారణం లేకుండా వాటిని ఎందుకు ప్రింట్ చేస్తారనే అనుమానం రాకమానదు..

News Paper: న్యూస్‌ పేపర్‌ చివర్లో ఈ నాలుగు రంగులు ఎందుకు ఉంటాయో తెలుసా.? పెద్ద కారణమే ఉందడోయ్‌..
Fact
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 15, 2022 | 11:07 AM

ఏ వార్త పత్రికలను గమనించినా చివర్లో నాలుగు రంగులు కనిపిస్తుంటాయి. ప్రతీ పేజీలో ఈ రంగులు తప్పనిసరిగా ఉంటాయి. చాలా మంది న్యూస్‌ పేపర్‌ చదివినా ఎప్పుడూ ఆ రంగులు ఏంటని ఆలోచించి ఉండరు. అయితే ఏ కారణం లేకుండా వాటిని ఎందుకు ప్రింట్ చేస్తారనే అనుమానం రాకమానదు. దీనివెనకాల పెద్ద కారణమే ఉంది. ఇంతకీ న్యూస్‌ పేపర్‌లో ఇలా ఎందుకు ప్రింట్‌ చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పేపర్‌లో కింద ఉండే నాలుగు రంగులను CMYK అంటారు. ఇందులో C అంటే సియాన్‌ (నీలం), M అంటే మెజెంటా (పింక్‌), Y అంటే యొల్లో, K అంటే నలుపు రంగుతో సూచిస్తారు. ఈ నాలుగింటినీ ప్రింటింగ్‌ పరిభాషలో ప్రాథమికగా రంగులుగా చెబుతారు. ఈ కలర్స్‌ కాంబినేషన్‌ ఆధారంగానే మనకు కావాల్సిన కొత్త రంగు వస్తుంది. ఇక పేపర్‌ ప్రింట్‌ చేసేసమయంలో ఈ నాలుగు రంగులకు సంబంధించిన ప్లేట్స్‌ను అమరుస్తారు. ఈ ప్లేట్స్‌ కేటాయించిన స్థలం నుంచి పక్కకు జరిగితే ప్రింటింగ్‌లో అక్షరాలు, ఫొటోలు సరిగ్గా ప్రింట్ అవ్వవు.

మరి ప్రింటింగ్ అవుతోన్న ప్రతీ పేపర్‌ను ఓపెన్‌ చేసిన సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో చూడలేం కదా. అందుకే పేపర్‌కి చివర్లో ఉండే ఈ నాలుగు రంగులను అక్కడక్కడ చెక్‌ చేస్తుంటారు. ఒక వేళ ఈ నాలుగు రంగులు సరిగ్గా ప్రింట్‌ కాకుండా ఏమైనా బ్లర్‌ వస్తే వెంటనే అలర్ట్‌ అయి సదరు కలర్‌ ప్లేట్స్‌ను సెట్‌ చేసి మళ్లీ ప్రింటింగ్ ప్రారంభిస్తారు. చూశారుగా పేపర్‌లో కనిపించే రంగుల వెనకాల అసలు కథ ఇదన్నమాట.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

సాగర తీరంలో నేడు బిగ్‌డే.. GVMC వద్ద ఉద్రిక్తత.. లైవ్
సాగర తీరంలో నేడు బిగ్‌డే.. GVMC వద్ద ఉద్రిక్తత.. లైవ్
ఇదెక్కడి చెత్త రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి టీంగా ఆర్‌సీబీ
ఇదెక్కడి చెత్త రికార్డ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి టీంగా ఆర్‌సీబీ
అంతా తూచ్..! ఆమె అలా అనలేదంటున్న హాట్ బ్యూటీ టీమ్
అంతా తూచ్..! ఆమె అలా అనలేదంటున్న హాట్ బ్యూటీ టీమ్
ధోనీ.. మెస్సీ కలయికతో షేక్ అవుతున్న సోషల్ మీడియా
ధోనీ.. మెస్సీ కలయికతో షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఇండియాలోనే బెస్ట్ బిర్యానీలివి.. వీటి రుచికి ప్రపంచమే ఫిదా
ఇండియాలోనే బెస్ట్ బిర్యానీలివి.. వీటి రుచికి ప్రపంచమే ఫిదా
టేస్టీ టేస్టీ స్పైసీ చిల్లీ పొటాటో తయారు చేసుకోండి.. రెసిపీ
టేస్టీ టేస్టీ స్పైసీ చిల్లీ పొటాటో తయారు చేసుకోండి.. రెసిపీ
ఢిల్లీలో లేడీ డాన్ జిక్రా అరెస్ట్..అసలు ఈ లేడీ డాన్ ఎవరో తెలుసా?
ఢిల్లీలో లేడీ డాన్ జిక్రా అరెస్ట్..అసలు ఈ లేడీ డాన్ ఎవరో తెలుసా?
ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ట్రిప్.. సారా అలీఖాన్ బ్యూటిఫుల్ ఫొటోస్
ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ ట్రిప్.. సారా అలీఖాన్ బ్యూటిఫుల్ ఫొటోస్
వంట నూనెలతో చికిత్సకు సాద్యంకాని బ్రెస్ట్ క్యాన్సర్ జాగ్రత్త సుమా
వంట నూనెలతో చికిత్సకు సాద్యంకాని బ్రెస్ట్ క్యాన్సర్ జాగ్రత్త సుమా
సౌందర్యకు ఇష్టపడ్డ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.?
సౌందర్యకు ఇష్టపడ్డ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.?