AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: స్కూల్ కు ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్ ను గుంజీలు తీయించిన టీచర్ .. కిడ్నీ సమస్యతో ఆస్పత్రి పాలు

గుంజీలు తీసిన కారణంగా విద్యార్థి కిడ్నీలో వాపు వచ్చిందని, చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్ దోడియా విచారణకు ఆదేశించారు

Gujarat: స్కూల్ కు ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్ ను గుంజీలు తీయించిన టీచర్ .. కిడ్నీ సమస్యతో ఆస్పత్రి పాలు
Gujarat School Student
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 15, 2022 | 6:31 PM

Share

గుజరాత్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని గిర్-సోమ్‌నాథ్ జిల్లాలో ఓ స్టూడెంట్ కు 200 గుంజీలు శిక్ష విధించిన శిక్ష విధించబడింది. టీచర్ వేసిన ఈ శిక్ష వల్ల విద్యార్థి పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దారుణ ఘటన గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని ఉనా నగరంలో చోటు చేసుకుంది. ఆ విద్యార్థి నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి స్కూల్ కు ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఉపాధ్యాయుడికి కోపం వచ్చి.. ఆ స్టూడెంట్ కు శిక్ష విధించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికారుల దృష్టికి చేరుకోవడంతో విచారణకు ఆదేశించారు.

ప్రస్తుతం విద్యార్థి రాజ్‌కోట్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుంజీలు తీసిన కారణంగా విద్యార్థి కిడ్నీలో వాపు వచ్చిందని, చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజేష్ దోడియా విచారణకు ఆదేశించారు. ఉనా తాలూకాలోని సరస్వతి స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న కరణ్‌కు శిక్ష విధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.

ఉపాధ్యాయుడిపై కేసు నమోదు: సరస్వతి స్కూల్ ప్రిన్సిపాల్ డి.కె. ఈ విషయం గురించి మాట్లాడారు. ఇది 15 రోజుల నాటి ఘటన అని ఇద్దరూ అంటున్నారు. అయితే, విద్యార్థి కి 200 గుంజీలు పనిష్మెంట్ వాదనను ఆయన తోసిపుచ్చారు. అదే సమయంలో.. ఈ ఘటనపై ఉపాధ్యాయునిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిశీలిస్తామని.. తాము ఎలాంటి వివక్షకు తావు ఇవ్వమని విద్యా  శాఖ చెబుతోంది. ఆరోపణలు నిజమని తేలితే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

తండ్రి ఏం చెప్పాడంటే:  బాధిత విద్యార్థి కరణ్ తండ్రి మహేశ్‌గిరి మీడియాతో మాట్లాడుతూ వారం.. పది రోజుల క్రితం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన కుమారుడి కాలి కండరాలు వాపుతో ఉన్నాయని చెప్పారు. నిరంతరం వాంతులు చేసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో తన కొడుకును వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కరణ్ తండ్రి తెలిపారు. అయితే అక్కడ కూడా అతని పరిస్థితి మెరుగుపడలేదు. అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కరణ్ ను రాత్‌కోట్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారని మహేష్ గిరి చెప్పారు. ఇక్కడ ప్రాథమిక వైద్య పరీక్షల్లో కరణ్ కిడ్నీ వాచిపోయినట్లు తేలింది. టీచర్‌, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!