Nandamuri Balakrishna: అభిమాని కుమార్తె వివాహ వేడుకలో బాలకృష్ణ.. నవాబు వేషధారణలో ..

ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలయ్య సత్యసాయి జిల్లా హిందూపురంలో సందడి చేశారు. ఓ ముస్లిం వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Nandamuri Balakrishna: అభిమాని కుమార్తె వివాహ వేడుకలో బాలకృష్ణ.. నవాబు వేషధారణలో ..
Nandamuri Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2022 | 9:03 PM

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. స్థానిక MYR ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఓ ముస్లిం వివాహవేడుకలో పాల్గొన్నారు. బాలయ్య రాకతో ఫంక్షన్‌ హాల్‌ పరిసరాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఆ ప్రాంతమంతా జై బాలయ్య నినాదాలతో మార్మోగింది. గ్రంథాలయ మాజీ చైర్మన్‌ గౌస్‌ మోహిద్దీన్‌ కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్యను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. టాపాసులు కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. పోలీసు బందోబస్తు, కిక్కిరిసిన అభిమానుల కేరింతల మధ్య ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు బాలయ్య. ఫంక్షన్‌ హాల్‌ చేరుకున్న బాలయ్యకు వధువు తండ్రి గౌస్‌ మోహిద్దీన్‌ దంపతులు పుష్పగుచ్ఛాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. వరుడికి ఫ్లవర్‌ బొకే ఇచ్చి ఆశీర్వదించిన బాలయ్య.. ముస్లిం వేషధారణలో అభిమానులను మురిపించారు. పెళ్లిపీటల దగ్గరకు వెళ్లి వధువును దీవించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురుకు గంధం పూసి ఆశీర్వదించారు. వధువుకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి కాసేపు ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వివాహ రిజిస్ట్రేషన్‌ పేపర్లపై సంతకం కూడా చేశారు. వధువు కుటుంబ పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సలామ్‌ అలేకుమ్‌ అంటూ అతిథులను ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుక అనంతరం టీడీపీ నేతలతో చర్చలు జరిపారు బాలయ్య. అక్కడి నుంచి బయలుదేరి వరద బాధితులను పరామర్శించారు.

నియోజకర్గంలో వరద పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు బాలయ్య. పంటలు ఎంతమేర నష్టపోయాయో వివరాలు తెలుసుకున్నారు.మోకాల్లోతు వరదనీటిలో నడుస్తూ స్థానికులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా వరదలతో తాము పడతున్న ఇబ్బందులను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు బాధితులు. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు బాలకృష్ణ. వరద ఉధృతి తగ్గాక. నష్టపరిహారంపై అధికారులతో అంచనా వేయిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నియోజకవర్గ ప్రజలను సొంత నిధులతో ఆదుకుంటానని చెప్పారు. అంతేకాదు.. వరదల ముంపు ప్రాంతాలైన చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజ నగర్, ఆర్‌టిసీ కాలనీ వాసులకు మంచినీరు, భోజన వసతి కల్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం  క్లిక్ చేయండి..