High Tension In Visakha Live: విశాఖలో తీరం దాటినా పొలిటికల్ తుఫాన్.. కొనసాగుతున్న హైటెన్షన్.. పవన్ హోటల్ చుట్టూ పోలీసులు..(లైవ్)
పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ప్రజల కోసం నిలబడితే.. పోలీసు నోటీసుల రూపంలో అవార్డు దక్కిందన్నారు. రిషికొండలో చేసిన విధ్వంసాన్ని ప్రజలకు చూపకుండా డ్రోన్లను కూడా నిషేధించారన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రెస్ మీట్‌లోనే ఉండగానే అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు… సెక్షన్ 30 ప్రకారం నోటీసులు అందజేశారు. వైజాగ్ వెస్ట్ జోన్ లిమిట్స్‌లో ఉన్న వైజాగ్ ఎయిర్‌పోర్టు దగ్గర.. జనసేన కార్యకకర్తలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు తమ నోటీసులో తెలిపారు పోలీసులు. జనసైనికుల చర్యలతో పలువురికి గాయాలైనట్టు చెప్పారు. జనసేనానితో పాటు పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. విశాఖ పరిధిలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సాయంత్రం 4 గంటల లోపుగా విశాఖపట్టణం వదిలి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ప్రజల కోసం నిలబడితే.. పోలీసు నోటీసుల రూపంలో అవార్డు దక్కిందన్నారు. రిషికొండలో చేసిన విధ్వంసాన్ని ప్రజలకు చూపకుండా డ్రోన్లను కూడా నిషేధించారన్నారు. ప్రజలకోసం జైలు కెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే పోలీసుల నోటీసులపై పవన్ కల్యాణ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..