YSR Rythu Bharosa: ఆళ్ళగడ్డలో నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. పర్యటనలో భాగంగా రైతు భరోసా..(లైవ్)

YSR Rythu Bharosa: ఆళ్ళగడ్డలో నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. పర్యటనలో భాగంగా రైతు భరోసా..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Oct 17, 2022 | 12:13 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారభించిన ముఖ్యమంత్రి ఆళ్లగడ్డలో..



సోమవారం ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.10 వరకు ఆళ్లగడ్డలోని జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 కు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. రైతులకు ఆర్ధిక సహాయం అందించడం, వారికి అండగా నిలబడడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారభించింది.రైతుల అభ్యున్నతి కోసం 2019 లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కోట్లాదిమంది అన్నదాతలు లబ్ది పొందుతున్నారు. ఏటా మొదటి విడత ఏప్రిల్ నుంచి జులై మధ్యలో, రెండో విడత ఆగష్టు, నవంబర్ మధ్యలో విడుదల చేస్తుంటారు. మూడో విడతగా డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో అన్నదాత ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 17, 2022 12:06 PM