Vaishali Takkar: ఆత్మహత్యపై ముందే హింట్‌ ఇచ్చిందా? నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న వైశాలి ఇన్‌స్టా పోస్ట్‌లు

వైశాలి ఠక్కర్‌ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. గతేడాది అతను ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఘటన వెనక సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా ప్రయేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Vaishali Takkar: ఆత్మహత్యపై ముందే హింట్‌ ఇచ్చిందా? నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న వైశాలి ఇన్‌స్టా పోస్ట్‌లు
Vaishali Takkar
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2022 | 7:40 PM

బాలీవుడ్ బుల్లితెర నటి వైశాలి టక్కర్‌ బలవన్మరణంతో బాలీవుడ్‌ మరొక్కసారి ఉలిక్కిపడింది. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఇండోర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైశాలి నివాసం నుంచి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌ నోట్‌లో ఉందని ఇండోర్‌ అసిస్టెంట్ పోలీస్‌ కమిషనర్‌ రహమాన్‌ తెలిపాడు. కాగా వైశాలి ఠక్కర్‌ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. గతేడాది అతను ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఘటన వెనక సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా ప్రయేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా వైశాలి హఠాన్మరణంతో హిందీ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు సంతాపం కలగాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

లాయల్టీ టెస్ట్ అంటూ..

కాగా వైశాలి ఆత్మహత్యపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన చివరి పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘లాయల్టీ టెస్ట్‌’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోలో ఆమె డబుల్‌ రోల్‌ చేస్తూ చేస్తూ తన బాయ్‌ఫ్రెండ్‌ నిజాయతీని పరీక్షించింది. ఈ టెస్ట్‌లో అతడు తనను మోసం చేశాడని తెలిసి వైశాలి బండబూతులు తిట్టింది. అయితే ఈ వీడియోకు కామెడీ, ఫన్నీ వీడియోస్‌ అన్న హ్యాష్‌ట్యాగులను జత చేసింది. ఈనేపథ్యంలో వీడియోను చూసిన నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూస్తుంటే ఇది స్కిట్‌లా లేదని, తన రియల్‌ లైఫ్‌లో జరిగిన దాన్నే ఇన్‌డైరెక్టుగా చెప్పినట్లుంది అంటున్నారు ఫ్యాన్స్‌. కాగా సరిగ్గా వారం క్రితం ఆమె పోస్ట్‌ చేసిన మరో వీడియో సైతం నెట్టింట వైరలవుతోంది. ఇందులో ‘ఆదివారం మీరేం చేస్తారు? నేనైతే ఇదిగో ఇలా ఖాళీగా ఉండి ఫ్యాన్‌ తిప్పుతూ ఉంటాను’ అని ఫ్యాన్‌ రెక్కలను చూపించింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ మరింత భావోద్వేగానికి గురవుతున్నారు. మీరు అప్పుడే హింట్‌ ఇచ్చారు. కానీ మేమే అర్థం చేసుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైశాలి గతేదాది ఏప్రిల్‌లో డాక్టర్‌ అభినందన్‌ సింగ్‌ హుందాల్‌తో ఎంగేజ్‌ మెంట్‌ జరుపుకుంది. అయితే కరోనా వల్ల వివాహం వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఎవరి దారు వారు చూసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..