Aamir Khan Ad: మళ్లీ వివాదంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ .. అమీర్ ఖాన్ – కియారా అద్వానీ నటించిన ఒక యాడ్‌పై ఆరోపణలు
అమీర్ ఖాన్ - కియారా అద్వానీ నటించిన ఒక యాడ్‌తో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అమీర్ యాడ్ విషయం మీద మండిపడ్డారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులను తప్పుగా చూపిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఆదిపురుష్ విషయంలో బాలీవుడ్ పలువురు రాజకీయ నాయకులకు టార్గెట్ అయింది. ఆ సినిమాలో హనుమంతుడికి, రాముడికి తోలు బట్టలు వేశారని, అది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని కొందరు రాజకీయ నేతలు ఇప్పటికే ఆదిపురుష్ టీమ్ మీద మండిపడ్డారు. ఇక తాజాగా బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అమీర్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు.
అమీర్ ఖాన్ – కియారా అద్వానీ నటించిన ఒక యాడ్‌తో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అమీర్ యాడ్ విషయం మీద మండిపడ్డారు. ఈ యాడ్ గురించి కామెంట్ చేస్తూ ఇలాంటి యాడ్స్ లేదా సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను వక్రీకరించడం ద్వారా మత విశ్వాసాలు దెబ్బతింటాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట పనిచేయాలని అన్నారు. ఏయూ బ్యాంక్ కోసం చేసిన ఒక యాడ్ తర్వాత అమీర్ ఖాన్, నటి కియారా అద్వానీ సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
विज्ञापनों और फिल्मों में भारतीय परंपराओं और रीति-रिवाजों को तोड़-मरोड़ कर प्रस्तुत करने से धार्मिक आस्थाएं आहत होती हैं।
फिल्म अभिनेता #AamirKhan जी को इसका ध्यान रखकर विज्ञापन करना चाहिए। pic.twitter.com/f7zUSkTnrp
— Dr Narottam Mishra (@drnarottammisra) October 12, 2022
సాంప్రదాయ ఆచారం ప్రకారం కాకుండా వధువు వరుడి ఇంటికి వెళ్లి అతని ఇంట్లో కుడికాలు పెడతారు. ఈ క్రమంలో అమీర్ ఖాన్ ప్రకటనలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని అమీర్ ఖాన్ ప్రకటనలు చేయాలని మిశ్రా డిమాండ్ చేశారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..