Nandamuri Balakrishna: టాలీవుడ్‌లోకి బాలయ్య చిన్న కూతురు! మోక్షజ్ఞ కంటే ముందుగానే!

బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు తేజస్విని నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారని సినిమా సర్కిల్‌లో వినిపిస్తోంది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. సొంత బ్యానర్‌పై సినిమాలు చేయాలని తేజస్విని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Nandamuri Balakrishna: టాలీవుడ్‌లోకి బాలయ్య చిన్న కూతురు! మోక్షజ్ఞ కంటే ముందుగానే!
Nandamuri Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2022 | 5:40 PM

వైపు సినిమాలతో సిల్వర్‌ స్ర్కీన్‌పై అదరగొడుతోనే అన్‌స్టాపబుల్‌ అంటూ డిజిటల్‌ స్ర్కీన్‌పై సత్తా చాటుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ టాక్‌షోకు ఊహించని స్పందన వస్తోంది. ఇటీవలే ప్రసారమైన సెకెండ్‌ సీజన్‌ మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు, ఆయన కుమారుడు హాజరయ్యారు. దీనికి టీఆర్పీ రేటింగ్‌లో హైయ్యెస్ట్‌ వ్యూస్ వచ్చాయి. కాగా అన్‌స్టాపబుల్‌ షోకు క్రియేటివ్‌ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించింది బాలయ్య చిన్న కూతురు తేజస్విని. ఆమెకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంతేకాదు బాలయ్య స్ట్రిప్ట్‌ వర్క్‌కు, డేట్స్,  కాస్ట్యూమ్స్ కు సంబంధించిన పనులు కూడా ఆమె చూసుకుంటుందట. అన్‌స్టాపబుల్‌ షో హిట్‌ కావడంలో బాలయ్య కూతురు కూడా కీలక పాత్ర పోషించిందంటున్నారు. ఈనేపథ్యంలోనే త్వరలోనే ఆమె నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు తేజస్విని నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారని సినిమా సర్కిల్‌లో వినిపిస్తోంది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. సొంత బ్యానర్‌పై సినిమాలు చేయాలని తేజస్విని ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై ప్రస్తుతానికి తేజస్విని కానీ, బాలయ్య కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

మరోవైపు బాలకృష్ణ నటవారసుడిగా త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. ఫొటోలు కూడా వైరలయ్యాయి. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదు. వీరి విషయం పక్కన ఉంచితే బాలయ్య మాత్రం సినిమాల్లో దూసుకెళుతున్నాడు. ఇప్పటికే గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే 107 పూర్తి కావొచ్చింది. దీపావళికి టైటిల్‌, టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నారు దర్శకనిర్మాతలు. కన్నడ సూపర్‌ స్టార్‌ దునియా విజయ్‌ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ బాలయ్య సరసన సందడి చేయనుంది. ఈ సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు కమిటయ్యారు బాలయ్య.

ఇవి కూడా చదవండి
Nandamuri Balakrishna 1

Nandamuri Balakrishna

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..