Anushka Shetty: కాంతారా సినిమాను చూసిన స్వీటీ.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో కూడా.. ఏమన్నారంటే?

ఇంతకుముందే పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రెండు సార్లు కాంతారా సినిమాను చూసినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు.

Anushka Shetty: కాంతారా సినిమాను చూసిన స్వీటీ.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో కూడా.. ఏమన్నారంటే?
Anushka Shetty
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2022 | 4:21 PM

కన్నడ హీరో రిషబ్‌ షెట్టి హీరోగా నటించిన చిత్రం కాంతారా. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగానూ మెప్పించాడు రిషబ్‌. కేజీఎఫ్‌ సిరీస్‌ ఫేం హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను నిర్మించారు. కన్నడనాట సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈనేపథ్యంలో ఇతర భాషల్లోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేశారు దర్శకనిర్మాతలు. హిందీలో శుక్రవారం రిలీజ్‌ కాగా.. తెలుగు నాట శనివారం విడుదలైంది. ఈ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కా శెట్టి కాంతారా సినిమాను చూసింది. అనంతరం తన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

‘కాంతార సినిమాను చూశాను. చాలా బాగుంది. సినిమాకు పనిచేసిన నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు కంగ్రాట్స్. అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ అందించిన కాంతార టీంకు ధన్యవాదాలు. హీరో రిషబ్‌ శెట్టి అద్భుతంగా నటించాడు. కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి..మిస్‌ కావొద్దు’ అని ఫ్యాన్స్‌కు సూచించింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇంతకుముందే పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రెండు సార్లు కాంతారా సినిమాను చూసినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, నవీన్‌ డీ పడ్లి, ప్రమోద్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించిన కాంతార చిత్రానికి అంజనీష్‌ లోక్‌ నాథ్‌ మ్యూజిక్‌, బీజీఎం అందించారు.కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?