Ginna Pre Release Event: గ్రాండ్‌గా మంచు విష్ణు జిన్నా ప్రి రిలీజ్ ఈవెంట్.. మనవడితో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన మోహన్ బాబు

Ginna Pre Release Event: గ్రాండ్‌గా మంచు విష్ణు జిన్నా ప్రి రిలీజ్ ఈవెంట్.. మనవడితో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన మోహన్ బాబు

Basha Shek

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 16, 2022 | 9:11 PM

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. విష్ణు సొంత బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహించాడు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు సరసన ఆర్‌ఎక్స్‌100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్‌ సందడి చేయనున్నారు.


మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. విష్ణు సొంత బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహించాడు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు సరసన ఆర్‌ఎక్స్‌100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్‌ సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. దీపావళి కానుకగా ఈనెల 21న భారీ స్థాయిలో జిన్నాను విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృంద. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జిన్నా జాతర పేరుతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు జి. నాగేశ్వర్‌ రెడ్డి కథను అందిస్తున్నారు. ఆయన గతంలో విష్ణుతో దేనికైనా రెడీ, ఆడో రకం ఈడో రకం వంటి హిట్‌ సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమాకు కథ అందించడంతో అంచనాలు పెరిగాయి. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే ను సమకూర్చాడు. సీనియర్ నటుడు నరేశ్, సురేశ్, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

 

Published on: Oct 16, 2022 07:06 PM