Astro Tips: లవంగాలతో ఇలాంటి పరిష్కారం చేస్తే.. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!

ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. అలాగే జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్న తొలగిపోతాయి. ఇంటి చీకటి మూలలో ఉంచండి. దీంతో ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ మెల్లగా తొలగిపోతుంది.

Astro Tips: లవంగాలతో ఇలాంటి పరిష్కారం చేస్తే.. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!
Cloves
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2022 | 7:04 PM

జ్యోతిషశాస్త్ర చిట్కాలు : సుగంధ ద్రవ్యాలు ఔషధంగా మాత్రమే ఉపయోగించబడవు.. కానీ, వాటి ఉపయోగం జీవితంలో పెను మార్పును తీసుకువస్తుంది. అలాంటి సుగంధ ద్రవ్యాల్లో లవంగాల కొన్ని పద్ధతులు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావడమే కాకుండా మీ జీవితానికి సంపద, సంతోషాలను కూడా తెస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఈ పద్ధతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లవంగాలతో ఎలాంటి ట్రిక్స్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

మీ పని ఏదయినా ఆగిపోయినా..? లేదా ఎక్కువ కాలం పెండింగ్‌లోనే ఉండిపోయినా లవంగాలు, యాలకులు, తమలపాకులు చుట్టి వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆగిపోయిన పనులు పూర్తి కావడమే కాకుండా జీవితంలో విజయం సాధిస్తారు. మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఈ నెగెటివ్ ఎనర్జీని పోగొట్టాలంటే 7 నుంచి 8 లవంగాలను కాల్చి ఇంట్లో ఏ మూలన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యం ఏర్పడి కలహాలు తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏదైనా పనిలో ఆటంకం ఏర్పడితే రెండు లవంగాలను ఆరతి పళ్ళెంలో వేయండి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. అలాగే జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఉన్న తొలగిపోతాయి.

ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే..లక్ష్మీ దేవికి ప్రతిరోజూ గులాబీ పువ్వుల గుత్తి రెండు లవంగాలు సమర్పించండి. ప్రతిరోజూ కాకపోయినా కనీసం శుక్రవారమైనా చేయండి. ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి లవంగాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అటువంటి పరిస్థితిలో మీరు నల్ల మిరియాలు, లవంగాలను మీ తలమీద నుంచి దూరంగా విసిరేయాలి. తద్వారా అడ్డంకులు మీ తల నుండి దూరంగా వెళ్లిపోతాయి.. ఎవరూ లేని చోట ఈ ట్రిక్ చేయండి. ఆపై వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి రండి. దీంతో డబ్బు కొరత తీరుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే శనివారం నాడు నూనెతో నాలుగు లవంగాలు కాల్చండి. ఇంటి చీకటి మూలలో ఉంచండి. దీంతో ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ మెల్లగా తొలగిపోతుంది. ఇంట్లో అన్ని పనులతో వచ్చే మార్పు మీరే చూడండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!