AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మకరరాశిలోనికి శని ప్రవేశం.. ఈ రాశులవారికి ముందే వచ్చిన దీపావళి..కనకవర్షం కురుస్తుంది.. !

అక్టోబరు 23న శని మకరరాశిలోకి ప్రవేశిస్తుంది. మకరరాశిలో శని సంచారం అన్ని రాశుల వారి జీవితంలో మార్పులను తెస్తుంది. రోజూ హనుమంతుడిని పూజించడం, శనివారాల్లో హనుమంతుడికి నైవేద్యాలు సమర్పించడం మంచిది.

Zodiac Signs: మకరరాశిలోనికి శని ప్రవేశం.. ఈ రాశులవారికి ముందే వచ్చిన దీపావళి..కనకవర్షం కురుస్తుంది.. !
Shani Dev
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2022 | 4:41 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో శ‌నీశ్వ‌రుడు చాలా ప్ర‌ధాన‌మైన గ్ర‌హం.. శ‌నీశ్వ‌రుడి గ‌మ‌నాన్ని బ‌ట్టే వ్యక్తుల లేదా ప‌రిస్థితుల శుభాశుభ కాలాన్ని నిర్ణ‌యించ‌వ‌చ్చు. శని గ్రహానికి మందుడు అని పేరు. ఇతను చాలా నెమ్మదిగా కదులుతాడు.. సాధార‌ణంగా శ‌నీశ్వ‌రుడు ఒక రాశి నుంచి మ‌రొక రాశి లోకి వెళ్ల‌డానికి రెండున్న‌ర సంవ‌త్స‌రాల స‌మ‌యాన్ని తీసుకుంటాడు. ఈ ప్రయాణంలోనే అక్టోబరు 23న శని మకరరాశిలోకి ప్రవేశిస్తుంది. మకరరాశిలో శని సంచారం అన్ని రాశుల వారి జీవితంలో మార్పులను తెస్తుంది. మకరం ఆశయం, ప్రతిష్ట, ప్రజా జీవితం శక్తికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రంలో, శని యొక్క వ్యతిరేక భ్రమణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మకరరాశిలో శని సంచారం కొన్ని రాశుల వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

మేష రాశి.. శని మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి వృత్తిపరంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. కెరీర్‌లో స్థిరత్వం, వృద్ధిని తెస్తుంది. ప్రజా జీవితంలో గౌరవం, కీర్తి పొందుతారు. అయితే ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ జీవితంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మీరు మీ వ్యక్తిగత, పని ప్రదేశంలో సరైన సమతుల్యతను కాపాడుకుంటే, మీరు శని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ కాలంలో మేష రాశి వారు మీ లక్ష్యాలను సాధించవచ్చు. దీనికి మరింత కృషి అవసరం. కుటుంబ సంబంధాలు బెడిసికొడతాయి. కుటుంబంలో కలహాలు, విబేధాలు తొలగిపోతాయి. మీరు పని రంగంలో ఏవైనా మార్పులు చేయడానికి ప్రయత్నించినట్లయితే, అది అనుకూలంగా మారుతుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక ప్రమేయం పెరుగుతుంది. రోజూ హనుమంతుడిని పూజించడం, శనివారాల్లో హనుమంతుడికి నైవేద్యాలు సమర్పించడం మంచిది.

మిథున రాశి.. వారసత్వంగా వచ్చిన ఆస్తిని పొందుతారు. పెట్టుబడుల ద్వారా శీఘ్ర ఆర్థిక లాభం ఉంటుంది. శనివారం ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయండి. మిధున రాశి వారు తమ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శని మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల ఆకస్మికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి.. వివాహ ఆలోచనలో ఉన్న వారికి ఇది శుభ సమయం. వివాహితులకు వారి వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. శనివారం నాడు శనికి నెయ్యి దీపం వెలిగించండి.

తులా రాశి.. తులారాశి వారికి ఈ శనిగ్రహ సంచారం లాభాన్ని చేకూరుస్తుంది. ఎప్పటి నుంచో చేయకుండా అలాగే ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో వ్యయప్రయాసలు ఉన్నా అవన్నీ పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థికపర ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ఆర్థికపరమైన విషయాలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. రుణబాధలు తీరిపోయే సూచనలు ఉన్నాయి. ఇది మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

ధ‌న‌స్సు రాశి.. శని మకరరాశిలో ప్రవేశిస్తున్నందున్న ధనస్సురాశి వారికి అదఈష్టం కలిసిరానుంది. కనకవర్షం కురుస్తుంది. ఈ రాశి వారికి జనవరి వరకు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. దాని వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఎప్పటి నుంచో రాని మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్టతలు పెరుగుతాయి.

మీన రాశి.. శని మకరంలోకి వెళ్లడం వల్ల ఈ రాశివారు అన్నింటా అఖండమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. మానసిక ఉల్లాసంతో కాలం గడుపుతారు. ఆర్థికపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ ప‌రంగా అనుకూలంగా ఉంటుంది. వ్య‌వ‌సాయ‌దారుల‌కు అనుకూల‌మైన కాలం.

మరిన్ని రాశి ఫలితాలకు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం