మొబైల్‌ఫోన్ దొంగిలించాడని 12 బాలుడిని బావిలో వేలాడదీసి.. కర్కశంగా..
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుడు అజిత్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయంపై సమగ్ర విచారణ ప్రారంభించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే నెపంతో 12 ఏండ్ల బాలుడి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. తన మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడనే నెపంతో సదరు వ్యక్తి 12 ఏళ్ల బాలుడిని బావిలో వేలాడదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఐదు నిమిషాల పాటు బాలుడిని ఒంటి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోయాడు. పైకి లాగమని ఆ బాలుడు ఎంత ప్రాధేయపడినా సదరు వ్యక్తి వినిపించుకోలేదు. తాను ఎలాంటి మొబైల్ ఫోన్‌ను దొంగిలిచంలేదని బాలుడు పదే పదే వేడుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాలుడిని బావిలోకి వేలాడదీసిన సమయంలో ఆ బావిలో సగానికిపైగా నీళ్లు ఉన్నాయి. ఒకవేళ సదరు వ్యక్తి ఆ బాలుడిని వదిలేసి ఉంటే.. నీటిలో మునిగి చిన్నారి మృతి చెందేవాడు. ఈ ఘటన లవకుశ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పైగా ఇదంతా వీడియో తీసినవారిపై కూడా నిందితుడు దాడికి పాల్పడినట్టుగా తెలిసింది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుడు అజిత్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయంపై సమగ్ర విచారణ ప్రారంభించారు. బాలుడి పట్ల కర్కశంగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. బాలుడి పట్ల సదరు వ్యక్తి వ్యవహరించిన తీరుని తప్పుబడుతున్నారు. అతను చేసిన పనికి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి