AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: కర్మ ఫలం అంటే ఇదే బాస్‌.. తన్నాడు.. తిరిగి తన్నించుకున్నాడు..

నెట్టింట్లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఓ ఆవును ఎక్కడికో తోలుకెళ్తున్నారు. ఆవు మెడలో ఓ తాడు కట్టిఉంది. దానిని పట్టుకొని ముందు ఒక వ్యక్తి నడుస్తుంటే అతని వెంటే నడుస్తుంది ఆవు. దాని వెనుక మరో వ్యక్తి కర్ర పట్టుకుని ఆవును అదిలిస్తూ..

Funny Video: కర్మ ఫలం అంటే ఇదే బాస్‌.. తన్నాడు.. తిరిగి తన్నించుకున్నాడు..
Man Gets Trampled by Cow
Amarnadh Daneti
|

Updated on: Oct 19, 2022 | 3:15 PM

Share

ఏ పనైనా చేసే ముందు అది మంచో చెడో ఆలోచించాలి. కొన్ని పనులు చేయకూడదని తెలిసినా కొంతమంది అలాంటి పనులే చేస్తుంటారు. సాధారణంగా పశువులను ఇబ్బంది పెట్టకూడదు. జంతువులకు ఆగ్రహం వస్తే దానిని మనుషులు తట్టుకోలేరు. చిన్న చిన్న జంతువులు అయితే వాటి బారినుంచి తప్పించుకోవచ్చు. అదే పెద్ద జంతువులు అయితే తప్పించుకోవడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అచ్చం అలాంటిదే. ఓ వ్యక్తి ఆ కారణంగా ఆవును ఇబ్బంది పెట్టాడు. మొదట ఎంతో శాంతంగా ఉన్న ఆవును తన్నడం, తోక లాగడం చేయడంతో ఆ సాధు జంతువు కూడా తిరగబడింది. అందుకే అంటారు మంచైనా, చెడైనా చేసిన పనికి ఫలితం అనుభవించే తీరాలి అని. దానినే కర్మ ఫలం అంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఇది కూడా. ఓ వ్యక్తి చేసిన పనికి వెంటనే కర్మఫలం అనుభవించాడు. నిర్దాక్షిణ్యంగా మూగ జీవిని హింసించాడు. వెంటనే రివెంజ్‌ తీర్చుకుంది ఆ సాధుజంతువు. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, బలహీనులుగా అస్సలు భావించకూడదు.

నెట్టింట్లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వీధిలో ఇద్దరు వ్యక్తులు ఓ ఆవును ఎక్కడికో తోలుకెళ్తున్నారు. ఆవు మెడలో ఓ తాడు కట్టిఉంది. దానిని పట్టుకొని ముందు ఒక వ్యక్తి నడుస్తుంటే అతని వెంటే నడుస్తుంది ఆవు. దాని వెనుక మరో వ్యక్తి కర్ర పట్టుకుని ఆవును అదిలిస్తూ నడుస్తున్నాడు. ఏమైందో ఓ చోటకు వచ్చేసరికి ఆవు అక్కడ ఆగింది. దాంతో వెనుక కర్రపట్టుకుని వస్తున్న వ్యక్తి దానిని కొట్టాడు. కాలితో తన్నాడు. అంతేకాదు దాని తోకపట్టుకొని గట్టిగా మెలితిప్పుడూ హింసించాడు. దాంతో సహనం కోల్పోయిన ఆ ఆవు వెంటనే అతనిపై తిరగబడింది. కిందపడేసి కుమ్మేసింది. ఆవు ఆగ్రహానికి ముందు తాడుపట్టుకున్న వ్యక్తికూడా భయంతో తాడును వదిలేసాడు. దాంతో తనను కొట్టిన వ్యక్తికి బుద్ధి చెప్పింది ఆవు. ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఆవుపట్ల ఆ వ్యక్తి తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. సాధు జంతువును హింసిస్తే కర్మఫలం అలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే స్పష్టత లేనప్పటికి.. భారత్ లోనే జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువకుడు బతికి ఉండకపోవచ్చని కొందరు అంటే.. ఆ యువకుడి ప్రవర్తనే ఈ స్థితికి కారణమని మరికరొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!