Horoscope Today: ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు.. దూర ప్రయాణాలు చేస్తారు

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వారు చాలా మంది ఉంటారు. అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను..

Horoscope Today: ఈ రాశివారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు.. దూర ప్రయాణాలు చేస్తారు
Horoscope Today
Follow us
Subhash Goud

|

Updated on: Oct 19, 2022 | 6:57 AM

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే తమ తమ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వారు చాలా మంది ఉంటారు. అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక అక్టోబర్‌ 19న వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

  1. మేష రాశి: వృత్తి, ఉద్యోగాల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
  2. వృషభ రాశి: వ్యాపారాలు అనుకూలిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల మాటను గౌరవించాలి.
  3. మిథున రాశి: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సంతోషాన్ని కలిగించే ఓ శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  4. కర్కాటక రాశి: పట్టుదలతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
  5. సింహ రాశి: చిత్త శుద్దితో చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.
  6. కన్య రాశి: చేపట్టిన పనులలో ఆలస్యం చేస్తే మరిన్ని ఆటంకాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి.
  7. తుల రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సహకాలు అందుకుంటారు. తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి సహకారం అందుకుంటారు.
  8. వృశ్చిక రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తుల విషయాలలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  9. ధనుస్సు రాశి: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి.
  10. మకర రాశి: ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.
  11. కుంభ రాశి: చేపట్టిన పనులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
  12. మీన రాశి: మంచి ఆలోచనతో విజయాన్ని అందుకుంటారు. చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి