గుంపులోంచి తప్పిపోయిన పెంగ్విన్‌ పిల్లకు దాహం తీర్చిన వ్యక్తి.. వీడియోపై ప్రశంసల వర్షం..

ఆ పెంగ్విన్‌ చాలా చిన్న పాప. బాటిల్ నోరు చాలా పెద్దగా ఉండటంతో దానికి అది ఓ పెద్ద జలపాతంలా, నీటి ప్రవాహంలా కనిపిస్తోంది. ఆ వ్యక్తి పెంగ్విన్‌ పిల్లకు నీళ్లు తాగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

గుంపులోంచి తప్పిపోయిన పెంగ్విన్‌ పిల్లకు దాహం తీర్చిన వ్యక్తి.. వీడియోపై ప్రశంసల వర్షం..
Thirsty Baby Penguin
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 19, 2022 | 9:09 PM

జాలి, దయ, సహాయం ఈ మూడు లక్షణాలు మానవాళికి చాలా ముఖ్యమైనవి. ఈ గుణాలే మనందరం ఈరోజు సజీవంగా ఉన్నాం అనడానికి నిదర్శనం. తరచుగా ఈ లక్షణాలు మనకు తెలియకుండానే మనలో పాతుకుపోతాయి. అలాంటి వ్యక్తి జంతువు, పక్షి అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి ఒక పెంగ్విన్‌కు సీసాతో నీళ్లు తాగిస్తున్నాడు. నీళ్లు తాగిస్తున్న వ్యక్తి మాత్రం వీడియోలో కనిపించడం లేదు. ఆ పెంగ్విన్‌ చాలా చిన్న పాప. బాటిల్ నోరు చాలా పెద్దగా ఉండటంతో దానికి అది ఓ పెద్ద జలపాతంలా, నీటి ప్రవాహంలా కనిపిస్తోంది. ఆ వ్యక్తి పెంగ్విన్‌ పిల్లకు నీళ్లు తాగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దాహంతో ఉన్న చిన్నారి పెంగ్విన్‌ను రక్షించేందుకు వచ్చిన వ్యక్తి వీడియో నెటిజన్ల హృదయాన్ని కదిలించేస్తోంది.

నిటారుగా నిలబడటం కూడా నేర్చుకోని చాలా చిన్న పాప ఇది. గుంపు నుంచి తప్పిపోయిందనుకుంటా పాపం.. అటూ ఇటూ తిరుగుతూ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అంతలోనే ఆ వ్యక్తి దానికి నీరు పోసి కాపాడాడు. అక్టోబర్ 17న, ఈ వీడియోను గాబ్రియేల్ కార్నో ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4,63,000 మంది చూశారు. 26,000 మంది ఈ వీడియోను లైక్ చేసారు. 8000 కంటే ఎక్కువ రీట్వీట్లు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.. నెటిజన్ల హృదయాన్ని కదిలించే చర్యతో ప్రజలు హత్తుకున్నారు. పెంగ్విన్‌కు సహాయం చేసినందుకు వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. వినియోగదారులు వీడియోపై హార్ట్‌, లవ్‌ సింబల్‌తో కూడిన ప్రేమతో కూడిన ఎమోజీలను కురిపించారు. ఒక వినియోగదారు “క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్” అని వ్రాస్తే, మరొకరు “అయ్యో, ఎంత అందమైన పెంగ్విన్!” అని వ్యాఖ్యానించారు. మూడవవాడు ఇలా వ్రాశాడు, ఓహ్ ఆ చిన్న పాప చాలా ముద్దుగా ఉంది.. నేనెప్పుడూ పెంగ్విన్‌ పిల్లను చూడలేదు. ఎంత మనోహరమైనది! అంటూ ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి