హిజ్రా జుట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ.. వీడియో వైరల్ చేశారు
తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు.
తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను వేధించడమే కాకుండా.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఓ ట్రాన్స్‌జెండర్ పొడవాటి జుట్టును బలవంతంగా రేజర్‌తో కత్తిరించారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త గ్రేస్ బాను ట్విటర్‌లో షేర్ చేశారు. 19 సెంకడ్ల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాధిత ట్రాన్స్‌జెండర్లను, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను గుర్తించామని.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తూత్తుకుడి ఎస్పీ బాలాజీ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

