అరుదైన శ్వేతనాగు హల్‌చల్.. పట్టబోయిన స్నేక్ క్యాచర్‌కు చుక్కలే..! వైరలవుతున్న వీడియో
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. వాటి ఆహారం సాధారణంగా ఇతర పాములు. కింగ్ కోబ్రా కాటుతో బాధితుడి శరీరంలోకి అత్యంత విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఈ వైరల్ వీడియోలో మీరు తెల్లటి కింగ్ కోబ్రాను చూస్తారు.
సోషల్ మీడియా అనేది అనేక వీడియోలతో నిండిన ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం కనిపిస్తుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఒక్కోసారి ఇక్కడ వీడియో చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కోసారి భయపడిపోతాం, ఒక్కోసారి నవ్వు ఆపుకోలేకపోతాం, మనం కూడా భయపడి వెళ్లిపోతాం. ఇక్కడ ఎక్కువగా అడవి జంతువులు, పాములు, పెళ్లికి సంబంధించిన గర్ల్‌ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ వీడియోలు వంటి వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో పాముల వీడియో చాలా పాపులర్. అనకొండ, కింగ్ కోబ్రా, శ్వేతనాగు లాంటి పాములను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ప్రత్యక్షంగా చూడకున్నా.. సినిమాల్లో అయినా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అలాంటిదే ఇక్కడ10 అడుగుల శ్వేతనాగుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. వాటి ఆహారం సాధారణంగా ఇతర పాములు. కింగ్ కోబ్రా కాటుతో బాధితుడి శరీరంలోకి అత్యంత విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఈ వైరల్ వీడియోలో మీరు తెల్లటి కింగ్ కోబ్రా కనిపిస్తుంది. తెల్లటి కింగ్ కోబ్రా చాలా అరుదు. తెలుగు సినిమాల్లో ఈ తరహా పాము కనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు కలుగు లోపల తెల్లటి కింగ్ కోబ్రాను చూడవచ్చు. అప్పుడు అది బొరియ నుండి బయటకు వచ్చి నీటిలో కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒక స్నేక్ క్యాచర్ శ్వేతనాగుని పోలి ఉన్నట్లుగా ఉన్న ఒక తెల్లటి నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక అది ముందు ఉన్న కలుగులో దూరుతూ ఉంది. ఇక కలుగులో దూరిన తర్వాత దాన్ని ఎలాగో బలవంతంగా బయటికి తీసుకొచ్చి పొలంలో వదులుతారు అక్కడున్న వ్యక్తులు. ఆ సమయంలో నీళ్లల్లో ఆ పాము పాకుతూ ముందుకు పోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ వీడియోని చూసి ఇది నిజమేనా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు.
ఈ వైరల్ వీడియో ఎండీ జియావుల్లా షా యూట్యూబ్ ఛానెల్ ద్వారా వైరల్ అవుతోంది. ఈ పాత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 21 k వీక్షణలు, చాలా లైక్‌లు, చాలా కామెంట్‌లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి