Diwali 2022: దీపావళి రోజున ఈ జంతువులను చూస్తే అదృష్టం వరిస్తుంది.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది..

వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజు ఈ 4 జంతువులను చూస్తే లక్ష్మి దేవి ప్రత్యేక అనుగ్రహం మీకు లభిస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Diwali 2022: దీపావళి రోజున ఈ జంతువులను చూస్తే అదృష్టం వరిస్తుంది.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది..
Diwali Vastu Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 4:51 PM

దీపావళి వాస్తు చిట్కాలు: దీపావళికి ఇంకా రెండ్రోజులు మాత్రమే ఉంది… దేశవ్యాప్తంగా దీపావళి వేడుకల కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ నెల 24న దీపావళి. ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వాసం ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవి, గణపతిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. దీపావళి రోజున ఇంట్లో దీపాలే కాకుండా మట్టి దీపాలు కూడా వెలిగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజు ఈ 4 జంతువులను చూస్తే లక్ష్మి దేవి ప్రత్యేక అనుగ్రహం మీకు లభిస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పిల్లి… జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దీపావళి రోజున పిల్లిని చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పిల్లిని చూడటం ద్వారా మీ ఇంటిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.

బల్లులు.. బల్లులంటే భయంతో పరిగెత్తెవారు చాలా మంది ఉన్నారు. అయితే దీపావళి రోజు ఇంట్లో బల్లిని చూస్తే చాలా మంచిదని మీకు తెలియని విషయం ఒకటి ఉంది. జ్యోతిష్యం ప్రకారం, దీపావళి రోజున బల్లిని చూడటం లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచన.

ఇవి కూడా చదవండి

గుడ్లగూబ.. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అందువల్ల గుడ్లగూబ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఎక్కడో గుడ్లగూబ కనిపిస్తే మీ అదృష్టం వరిస్తుంది.

ఆవు.. హిందూ మతంలో ఆవును తల్లిగా భావిస్తారు. ప్రజలు ఆవును పూజిస్తారు. దీపావళి నాడు ఎక్కడైనా కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవు కనిపించడం చాలా శుభసూచకమని చెబుతున్నారు. దీపావళి రోజున ఈ రంగులో ఉన్న ఆవును చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం, సంపదలు వస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి