AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళి రోజున శుభాన్ని ఇచ్చే రంగోళిని ఇంటికి ఏ వైపున ముగ్గులు వేయాలి.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

దీపావళి రోజున వేసే సంపద, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి బయట, లోపల తయారు వేసే ముగ్గులు లక్ష్మీ దేవిని స్వాగతిస్తారు. అందంగా అలంకరించిన ఇంటిలోకి ముగ్గులు స్వాగతం చెబుతుంటే..లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని నమ్మకం.

Diwali: దీపావళి రోజున శుభాన్ని ఇచ్చే రంగోళిని ఇంటికి ఏ వైపున ముగ్గులు వేయాలి.. ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
Diwali Rangoli
Surya Kala
|

Updated on: Oct 21, 2022 | 9:30 AM

Share

దీపావళి పండుగ రోజున అందంగా అలంకరిస్తారు. ఇంటిని శుభ్రం చేసి.. అందంగా అలంకరిస్తారు. శుభ చిహ్నాలు, ముగ్గులు, దీపాలతో అలంకరించే సంప్రదాయం ఉంది. దీని వెనుక భిన్నమైన పురాణాల కథనాలున్నాయి. ఒక నమ్మకం ప్రకారం, దీపావళి రోజున, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం చేసి.. రావణుడిని చంపిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. శ్రీరాముడు తన భార్య, రాముడు లక్ష్మణుడి తో కలిసి అయోధ్యకు రావడంతో ప్రజలు సంతోషంతో అయోధ్య మొత్తాన్ని అలంకరించి దీపాలు వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు దీపావళి రోజున ఇంటిని ముగ్గులు, దీపాలతో అలంకరించే సంప్రదాయం కొనసాగుతోంది. దీపావళి రోజున వేసే సంపద, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి బయట, లోపల తయారు వేసే ముగ్గులు లక్ష్మీ దేవిని స్వాగతిస్తారు. అందంగా అలంకరించిన ఇంటిలోకి ముగ్గులు స్వాగతం చెబుతుంటే.. లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని నమ్మకం. అంతేకాదు దీపావళి రోజున శుభాలను ఇచ్చే ముగ్గును ఇంట్లో ఏ మూలన ఎలా వేయాలి.. దీని మతపరమైన విశిష్టత ఏమిటో వివరంగా తెలుసుకుందాం..

  1. రంగోళి లేదా ముగ్గులు అనే పదం ‘రంగ్’ ..  ‘అవల్లి’ అనే రెండు పదాల కలయిక నుండి ఉద్భవించింది. అంటే – రంగుల వరుస. తీజ్-పండుగల్లో ఈ పురాతన కళ ప్రాముఖ్యత గురించి చెప్పబడింది.
  2. ఇంటి లోపల మరియు వెలుపల అనేక రకాల రంగోలీలను తయారు చేస్తారు, కానీ దీపావళి రోజున కమలంతో రూపొందించిన రంగోలీని వేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం.. దీపావళి రోజున తామర పువ్వుల ముగ్గు వేస్తే.. లక్ష్మి దేవి సంతోషిస్తుంది. తామరలు ముద్దు.. సంపదకు అధిదేవత లక్ష్మీ దేవి స్థానంగా పరిగణించబడుతుంది.
  3. వాస్తు ప్రకారం దీపావళి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముగ్గు వేయాలి. ముఖ్యంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, గులాబీ, నారింజ వంటి రంగులతో ముగ్గును అందంగా అలంకరించడానికి ఉపయోగించాలి. ఈ రంగులను ఉపయోగించడం ద్వారా, సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ముగ్గుకు నలుపు రంగు వాడకూడదు.
  4. ముగ్గును వేసే సమయంలో మీ వేలు, బొటనవేలు కలిసి జ్ఞానముద్ర (ప్రాణాయామ భంగిమ)ను ఏర్పరుస్తాయి. ఈ వేలి భంగిమలు మీ మెదడును మరింత శక్తివంతంగా, చురుగ్గా మారుస్తాయని..  అలాగే మీ మేధో శక్తిని పెంచుతుందని నమ్ముతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ముగ్గును వేసే సమయంలో పిండి, బియ్యం, పసుపు, కుంకుమ, పువ్వులు, ఆకులను ఉపయోగించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.  దీపావళి రోజున వివిధ రంగులతో రంగోళీని వేయడానికి బియ్యం ఉపయోగించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Follow Us