AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారికి 10 ఎలక్ట్రిక్ బస్సులు విరాళం.. పర్యావరణ పరిరక్షణకు టీటీడీ విప్లవాత్మక నిర్ణయం

టీటీడీకి విరాళమిచ్చే అవకాశమిచ్చిన టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. మా గ్రూప్ చైర్మన్ మేఘా కృష్ణారెడ్డి శ్రీవారికి పరమ భక్తుడు.. ఆయన అంగీకారంతో బస్సులను విరాళంగా ఇస్తున్నామని సీఎండీ ప్రదీప్ చెప్పారు. 

Tirumala: శ్రీవారికి 10 ఎలక్ట్రిక్ బస్సులు విరాళం.. పర్యావరణ పరిరక్షణకు టీటీడీ విప్లవాత్మక నిర్ణయం
Electric Buses In Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2022 | 11:41 AM

తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు తిరుమలలో తిరిగే ట్యాక్సీలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు టీటీడీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మరోవైపు టీటీడీకి 10 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇచ్చింది మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థ. వాస్తవానికి భక్తుల సౌకర్యార్థం తిరుమలలో 12 ఉచిత బస్సులను నడుపుతున్నారు. అయితే వీటి స్థానంలో తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తాను శ్రీవారికి ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వాలని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ సీఎండీ ప్రదీప్ ను ఇవ్వాలని గతంలో తాను కోరినట్లు చెప్పారు. దీంతో మేఘా సంస్థ వారు భక్తుల కోసం 10 బస్సులను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాజాగా రూ.15 కోట్లు విలువైన బస్సులను మేఘా సంస్థ టీటీడీకి విరాళంగా ఇస్తోందన్నారు. భక్తుల కోసం విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన మేఘా కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు సుబ్బారెడ్డి. అంతేకాదు తాము మేఘా సంస్థ  వ్యాపారం మరింత వృద్ధి చెందాలని శ్రీవారిని ప్రార్థించామని టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇదే విషయంపై ఒలెక్ట్రా సంస్థ సీఎండీ ప్రదీప్ స్పందిస్తూ.. తమకు టీటీడీకి విరాళమిచ్చే అవకాశమిచ్చిన టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. చైర్మన్ కు ఆలోచన వచ్చి తమను సంప్రదించకుండా ఉండకపోతే.. భక్తులకు సేవ చేసే అవకాశం కోల్పోయేవాళ్లమని చెప్పారు. అంతేకాదు మా గ్రూప్ చైర్మన్ మేఘా కృష్ణారెడ్డి శ్రీవారికి పరమ భక్తుడు.. ఆయన అంగీకారంతో బస్సులను విరాళంగా ఇస్తున్నామని సీఎండీ ప్రదీప్ చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు టీటీడీ ప్రణాళిక

ఇవి కూడా చదవండి

మరోవైపు తిరుమల్లో తిరిగే ట్యాక్సీలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు టీటీడీ ప్రణాళికను రెడీ చేస్తోందని టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు. బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లకు సహకారమందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుమలలోని ట్యాక్సీలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ముందడుగు వేస్తున్నామన్నారు. అయితే ట్యాక్సీ డ్రైవర్లు ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయలేరు కనుక.. వారికీ టీటీడీ సహకారం అందించనున్నదని పేర్కొన్నారు. ఒన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ కాబట్టి ట్యాక్సీ డ్రైవర్లకు టీటీడీ సహకారం అందిస్తుందని.. ఒక్కసారి కనుక ఒకసారి వాహనం కొంటే 15 ఏళ్లు వినియోగించుకోవచ్చనని చెప్పారు. 10 నుండి 12 మంది సామర్థ్యం కలిగిన వాహనాలు తయారు చేసే సంస్థల నుండి టెండర్లు పిలుస్తామని టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..