AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: న్యూయార్క్ లో దీపావళికి దక్కిన ప్రాముఖ్యత.. పబ్లిక్ హాలీడేగా ప్రకటన .. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే..

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ దీపావళిని పాఠశాలలకు సెలవుగా ప్రకటించినందుకు ఆడమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని గుర్తు చేసుకున్నారు.

Diwali: న్యూయార్క్ లో దీపావళికి దక్కిన ప్రాముఖ్యత.. పబ్లిక్ హాలీడేగా ప్రకటన .. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే..
Diwali to be public school holiday in New York City
Surya Kala
|

Updated on: Oct 21, 2022 | 12:14 PM

Share

హిందువుల ప్రముఖ పండగల్లో ఒకటి దీపావళి.  ఈ పండగ వస్తుందంటే చాలు దేశ విదేశాల్లో ఉన్న భారతీయులు దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడానికి రెడీ అవుతారు. అయితే తాజాగా దీపావళి పండగకి న్యూయార్క్ లో ప్రాముఖ్యత దక్కింది. దీపావళి పండగను ప్రభుత్వ పాఠశాల సెలవు దినంగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్. ఈ నిర్ణయం 2023 నుంచి నగరంలో అమల్లోకి రానున్నదని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ నిర్ణయం నెక్స్ట్ ఇయర్ నుంచి కార్యరూపం దాల్చనున్నదని..  నగరం ప్రాముఖ్యత గురించి .. న్యూయార్క్ పట్టణ ఏకత్వంపై సందేశం ఇచ్చినట్టు అయిందన్నారు. అంతేకాదు పిల్లలకు దీపావళి పండగ గురించి తెలుసుకునే విధంగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. స్కూల్ కేలండర్ లోని యానివర్సరీ డేను దీపావళి కోసం కేటాయించారు. యానివర్సరీ డేను ఏటా జూన్ మొదటి గురువారం అక్కడ నిర్వహిస్తుంటారు. ఇదే విషయం పై న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్‌కుమార్ స్పందిస్తూ.. దీపావళి గురించి , దీపాల పండుగ అంటే ఏమిటో “చాలా నేర్చుకున్నాను” అని అన్నారు.

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ దీపావళిని పాఠశాలలకు సెలవుగా ప్రకటించినందుకు ఆడమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం న్యూయార్క్ పట్టణ వైవిధ్యం, బహుళత్వానికి బలమైన సందేశం ఇచ్చిందని చెప్పారు. దీపావళిని అన్ని వర్గాల ప్రజలు సంబరాలు చేసుకోవడానికి, భారతీయ తత్వం, వారసత్వాన్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది’’ అని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నిర్ణయంతో తాము గర్వపడుతున్నామని.. న్యూ యార్క్ లో దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు,  జైన మతాలకు చెందిన 2,00,000 మంది న్యూయార్క్ వాసులకు గుర్తింపు దక్కే సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుని వచ్చిన  చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ నగరంలో దీపావళికి పాఠశాల సెలవు ఉంటుంది.

న్యూయార్క్ రాష్ట్ర విద్యా చట్టాల ప్రకారం.. కనీసం 180 రోజుల పాఠశాల బోధన ఉండాలి. ఈ నేపథ్యంలో ఇక నుంచి పాఠశాల క్యాలెండర్‌లో సెలవులపై ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా