Bharat Jodo Yatra: ఏపీలో ముగిసిన రాహుల్ భారత్ జోడో యాత్ర.. 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర
రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది..
రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. గురువారం కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. జోడో యాత్రలో భాగంగా గురువారం నాటి యాత్రను మంత్రాలయంలో ముగించిన రాహుల్ గాంధీ. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పంచెకట్టుతో రాహుల్ గాంధీ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మర్యాదలతో రాహుల్ కు వేద పండితులు స్వాగతం పలకగా.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ నుంచి ప్రారంభమైన రాహుల్ జోడో యాత్ర.. మాధవరం, తుంగభద్ర వంతెన మీదుగా ముగిసి కర్నాటకలోకి జోడోయాత్ర ప్రవేశించింది.
Shri @RahulGandhi offered his prayers at Sri Raghavendra Swamy Mutt followed by a brief meeting with Sri Subudhendra Tirtha ji at Mantralayam.#BharatJodoYatra pic.twitter.com/PfPT3ZDhHO
— Congress (@INCIndia) October 20, 2022
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులతోపాటు.. తెలంగాణ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఏపీ నుంచి కర్ణాటకకు, ఆ తర్వాత 23న తెలంగాణకు భారత్ జోడో యాత్ర చేరుకోనుంది. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలలో ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లడం వాటి పరిష్కార మార్గాలను అధికారంలోకి రాగానే ఆలోచించే ఆలోచనలో ఉందంటూ పార్టీ నేతలు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి