Jammu: మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. పర్యాటకుల మనసులు దోచేస్తున్న ప్రకృతి అందాలు..

హిమాలయ పర్వత శ్రేణిని మంచు కప్పేసింది. శీతాకాలం ప్రారంభమవుతుండటంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. భారీగా మంచువర్షం కురుస్తోంది. దీంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ప్రకృతి రమణీయత ప్రాంతాలన్నీ..

Jammu: మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. పర్యాటకుల మనసులు దోచేస్తున్న ప్రకృతి అందాలు..
Snowfall in jammu and kashmir
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 21, 2022 | 6:55 AM

హిమాలయ పర్వత శ్రేణిని మంచు కప్పేసింది. శీతాకాలం ప్రారంభమవుతుండటంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. భారీగా మంచువర్షం కురుస్తోంది. దీంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. ప్రకృతి రమణీయత ప్రాంతాలన్నీ శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. జమ్ముకశ్మీర్‌తో పాటు కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ పుణ్యక్షేత్రాలు మంచు వర్షంలో తడిసిముద్దయ్యాయి. పాల నురగల్లాంటి అక్కడి మంచు అందాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి.

జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జమ్ములో 18.7డిగ్రీల సెల్సియస్‌, కత్రాలో 16.4, బటోట్‌లో 9.4, భదర్వాలో 8.6, బనిహాల్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. లద్దాఖ్‌లోని ద్రాస్‌, లేహ్‌లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఆ ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ఎటుచూసినా మంచు కనువిందు చేస్తోంది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ కప్పేసింది మంచు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఇదిలా ఉంటే మంచు వర్షంతో పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తుంటే స్థానికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మంచుతో వాహన రాకపోకలకు అంతరాయం కులుగుతోంది. దీంతో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడే ప్రమాదముందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌ను జమ్ములోని పూంచ్‌ జిల్లాతో కలిపే మొఘల్‌ రోడ్డును మంచు కారణంగా మూసేశారు. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..