దారుణం.. డెంగ్యూతో చికిత్స పొందుతున్న వ్యక్తికి మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. రోగి మృతి

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది.

దారుణం.. డెంగ్యూతో చికిత్స పొందుతున్న వ్యక్తికి మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. రోగి మృతి
Dengue Patient Died
Follow us

|

Updated on: Oct 20, 2022 | 7:51 PM

ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. దీంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే డెంగీ రోగి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ ఝుల్వాలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతిచెందాడంటూ మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వేదాంక్‌ సింగ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వార్త వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రయాగ్‌రాజ్‌ ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించడంతో రోగి ప్రదీప్ పాండే చనిపోయాడని బంధువులు ఆరోపించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీడియోలో కూడా ప్లేట్‌లెట్స్‌కు బదులుగా ఆ ప్యాకెట్‌లో మోంసబి జ్యూస్ కనిపించింది. డెంగీ రోగి చనిపోయిన ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్‌ పఠాక్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేశ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు కమిటీ విచారణ జరుపుతుందన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ తెలిపారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నకిలీ బ్లడ్ బ్యాంక్‌ను కూడా గుర్తించి బ్యాన్‌ చేసినట్టుగా సింగ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles